రాష్ట్రీయం

బకాయిల లడాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: ఆంధ్ర, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిల రగడ రాజుకుంది. రూ.3100 కోట్లు బకాయిలను తెలంగాణ జెన్కో తక్షణం చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ జెన్కో నోటీసులు జారీ చేసింది. ఈ సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్కరించేందుకు సిద్ధమని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఆంధ్ర జెన్కో రోజూ 400 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఈ విద్యుత్‌కు సంబంధించి బకాయిలు రూ.4498 కోట్ల వరకు పేరుకుపోయాయి. అదే విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి విద్యుత్ ఆంధ్రకు సరఫరా అవుతుంది. ఈ విద్యుత్‌కు సంబంధించిన ఆంధ్ర రూ.1360 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. తమకు ఈ బకాయిలను మినహాయించుకుంటే రూ. 3138 కోట్లను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఏపి జెన్కో అధికారులు తెలిపారు.
ఈ విషయమై తెలంగాణ జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు ఆంధ్రభూమితో మాట్లాడుతూ సమస్యపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఒకవేళ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని, సామరస్యంగ మాట్లాడుకుందామని తమ ప్రభుత్వం మొదటి నుంచి ప్రతిపాదిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్ధలు తెలంగాణకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తే తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఏపీ విద్యుత్ శాఖలు ఈ విషయంలో తొందరపడరాదని తాను కోరుతున్నట్లు చెప్పారు. సరఫరా ఆపేస్తామంటే వారిష్టమని వ్యాఖ్యానించారు. విద్యుత్‌కు విద్యుత్ అనే సూత్రంతో వారు ముందుకు వస్తున్నారని, కాని నగదుకు నగదనే సూత్రాన్ని తాము ప్రదిపాదిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రలో కలిసిన కడప, కర్నూలు జిల్లాల విద్యుత్ పరిధి తొలుత హైదరాబాద్ సిపిడిసిఎల్ పరిధిలో ఉండేవన్నారు. దీనికి సంబంధించి తమకు రూ.800 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ సమస్యలను కూర్చుని చర్చించుకుంటేనే పరిష్కారం అవుతుందన్నారు.
కాగా సింగరేణి నుంచి బొగ్గు ఆంధ్రప్రదేశ్ జెన్కోకు క్రమబద్ధీకరించారు. దీనికి సంబంధించి రూ.1437 కోట్ల బకాయిలను ఏపి ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సి ఉంది. కాని ఈ బకాయిలను విద్యుత్ బకాయిల సర్దుబాటులో చేసేందుకు సింగరేణి అంగీకరించలేదు. కాని ఈ ప్రతిపాదనకు తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీ అంగీకరించింది. తమకు ఆంధ్ర విద్యుత్ సంస్ధలు నోటీసులను గత నెల 31న జారీ చేశాయన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్ధలు రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్‌ను తట్టుకుని సరఫరా చేస్తాయని, కొరత తలెత్తదని దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు.