రాష్ట్రీయం

ఇలా ‘ట్రై’ చేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 6: గిరిజనుల సమగ్రాభివృద్ధికి గిరిజన సంస్కరణ కొలబద్ద (ట్రై) పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ ఏజెన్సీ పెదలబుడు పంచాయతీని సిఎం చంద్రబాబు దత్తత తీసుకున్నారు. ఆ పంచాయతీలో మంగళవారం ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. భారీవర్షాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన హాజరు కాలేకపోయారు. అయితే, పెదలబుడు పంచాయతీ గ్రామస్తులు, లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎం మాట్లాడారు. ముఖ్యంగా గిరిజనుల ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అందులో భాగమే ‘ట్రై’ అన్నారు. ట్రై (ట్రైబల్ రీఫాం యార్డ్‌స్టిక్) గురించి ఆయన వివరిస్తూ గిరిజనుల ఆరోగ్యం, అభివృద్ధికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి, ఒక కొలబద్ద ప్రకారం అంచనా వేస్తారు. నిర్ణీత కాల వ్యవధిలో గిరిజనులకు సేవలందించడం కోసం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు చెప్పారు. మూడు నెలలకు ఒకసారి ఆయా శాఖల అధికారులు సమావేశమై ట్రై ద్వారా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించాలన్నారు. ప్రతి మూడు నెలలకు 12.5 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. పురోభివృద్ధి పరిరక్షణకు ట్రై టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, ప్రతి ఐటిడిఏ పరిధిలో ప్రత్యేక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రులు, పాడేరులో జిల్లాస్థాయి ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నామని వివరించారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏజెన్సీలోని అన్ని ఆసుపత్రుల్లో 125 శాతం రీయింబర్స్‌మెంట్ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే అరకు మెడికల్ రిహాబిలిటేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టౌన్‌షిప్ (అమ్రిత్) పేరిట అరకును అన్ని విధాలా అభివృద్ధి చేసి పట్టణీకరణ దిశగా అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అరకును హెల్త్ వ్యాలీగా చేసి, తద్వారా హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వివరించారు. గిరిజనుల కోసం ఐసిఎంఆర్ ద్వారా రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్‌లో నాలెడ్జ్ పార్ట్‌నర్‌షిప్ కోసం ట్రై ప్రోగ్రాంలో ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ ట్రై ప్రోగ్రాంను సంకల్పదీక్ష ప్రతిజ్ఞలో చేర్చుతామని సిఎం చంద్రబాబు చెప్పారు.
ఇదిలా ఉండగా గిరిజనులను సాంకేతికంగా అభివృద్ధిపరిచేందుకు ఫైబర్ నెట్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. డిసెంబర్ నాటికి ఫైబర్ నెట్ ఏజెన్సీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఎస్టీ హాస్టళ్ల అభివృద్ధికి 321 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, గిరిజన పిల్లలను విదేశీ విద్య కోసం పంపించాలనుకుంటే ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. అవసరమైతే వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో రూ.1250 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు సర్ట్ఫికేషన్ తీసుకుంటే, ఆయా వస్తువుల మార్కెటింగ్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన పెదలబుడు సర్పంచ్ గులాబితోపాటు, వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితో సిఎం మాట్లాడారు.

చిత్రం.. వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం చంద్రబాబుతో మాట్లాడుతున్న పెదలబుడు సర్పంచ్ గులాబి