రాష్ట్రీయం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారికి మూడేళ్ల జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టుకున్న ఓ అధికారికి మూడేళ్లు జైలు శిక్ష పడింది. అక్రమార్జనకు జరిమానాగా రూ.5 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ఖమ్మం జిల్లా పాల్వంచ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్‌గా పని చేసిన పిట్ట ప్రతాప్ ఆ సమయంలో చేతికి దొరికినంత మేరకు లంచాలు దండుకుని, వాటిని ఆస్తుల రూపంలోకి మార్చాడు. కానీ సక్రమంగా మార్చుకోలేక ఏసిబి అధికారులకు చిక్కాడు. ప్రతాప్ ప్రభుత్వ అధికారిగా మొత్తం రూ.30.33 లక్షల అక్రమాస్తులు కూడబెట్టుకున్నాడు. అవినీతి సొమ్మును లెక్క చూపించలేకపోవడంతో ఏసిబి అధికారులు కేసు నమోదు చేశారు. కేసు నిర్థారణ కావడంతో సదరు అధికారికి కోర్టు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది.