రాష్ట్రీయం

నయనానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూన్ 8: నాట్యక్షేత్రం కృష్ణా జిల్లా కూచిపూడిలోని నాట్య పుష్కరిణిలో నాట్య గురువుల నృత్యప్రదర్శనలు కళాభిమానులు, కళాకారులను ఆకట్టుకున్నాయి. కూచిపూడి నాట్యారామం, రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కూచిపూడి నాట్య గురు శిక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పసుమర్తివారి ధర్మచెరువులో నిర్మించిన నాట్య పుష్కరిణిలో సంగీత, సాహిత్యాలకు అనుగుణంగా నాట్య గురువులు ప్రదర్శించిన నృత్యప్రదర్శనలు శిక్షణా తరగతులకు హైలెట్‌గా నిలిచాయి. డాక్టర్ వేదాంతం రామలింగశాస్ర్తీ విరచిత అమ్మవారి కీర్తన, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలోని శంకరపురహర.. అనే అంశాన్ని, ముత్తుస్వామి దీక్షితుల కీర్తనగా శ్రీ సిద్ధి వినాయకం.., భామాకలాపంలోని మదన సుందరవదన అనే అంశాలను లయబద్ధంగా ప్రదర్శించారు. నాట్యరామ కమిటీ చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో కళాపీఠం ప్రిన్సిపాల్ రామలింగశాస్ర్తీ నట్టవాంగంలో, చింతా రవిబాలకృష్ణ, ఏలేశ్వరపు శ్రీనివాస్, వేదాంతం వెంకట దుర్గ్భావానీ గాత్ర సహకారంతో, పసుమర్తి హరనాథశాస్ర్తీ, చింతా సూర్యప్రకాష్‌ల మృదంగ సహకారంతో ఈ నృత్య ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మేనేజర్ డాక్టర్ ఆర్ వాసుదేవసింగ్, వేదాంతం రాధేశ్యాం, తదితరులు పాల్గొన్నారు.