రాష్ట్రీయం

కాఫర్ డ్యాంకు శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూన్ 8: ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం చరిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన కాఫర్ డ్యామ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అక్కడే నిర్మించే ఐకానిక్‌బ్రిడ్జికి కూడా శంకుస్థాపన చేశారు. పవిత్రమైన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లటం తనకెంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బహుళ ప్రయోజనాలను అందించే పోలవరం ప్రాజెక్టును పర్యాటకంగా కూడా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న అద్భుతమైన పరిసరాలను, పర్యావరణాన్ని పోలవరం ప్రాజెక్టుకు జోడించటం ద్వారా ఈప్రాంతాన్ని కొత్తపుంతలు తొక్కిస్తామని
ఆయన ప్రకటించారు. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయటం ద్వారా ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని అద్భుతమైన ప్రదేశాలకు పర్యాటకులు సులువుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. శంకుస్థాపనకు ముందు ఆ ప్రాంతంలో జరుగుతున్న పనులు సిఎం పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ అనుకున్న లక్ష్యం మేరకు ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికే మట్టిపనులు 70శాతానికి పైగా పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా అనుకున్న రీతిలోనే ముందుకు సాగుతోందని, 48గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికే 20పూర్తి అయ్యాయని, మిగిలిన 28కూడా అనుకున్న సమయానికి పూర్తిచేస్తామన్నారు. కాఫర్ డ్యామ్‌కు సంబంధించి 28లక్షల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేసే స్థాయిలో నిర్మాణం జరుగుతుందని, వందేళ్లలో వచ్చిన అత్యధిక వరదను పరిగణనలోకి తీసుకుని డ్యామ్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఇది సుమారుగా 2340 మీటర్ల పొడవున ఉంటుందని వివరించారు. స్పిల్‌వేకు సమీపంలో నిర్మిస్తున్న ఐకానిక్ బ్రిడ్జి 1050 మీటర్ల పొడవు ఉంటుందని చెప్పారు.
పర్యాటకంగా ఈప్రాంతాన్ని కీలకంగా తీర్చిదిద్దేందుకు ప్రపంచంలోనే ఉత్తమ కన్సల్టెంట్‌ను సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఐకానిక్ బ్రిడ్జిపై సాధారణ ట్రాఫిక్‌ను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత పర్యాటకులు ఇటు ధవళేశ్వరం బ్యారేజీ సందర్శించడానికైనా, అటు కోనసీమ ప్రాంతాన్ని సందర్శించడానికైనా కేవలం 45నిముషాల సమయం పడుతుందని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 2018 నాటికి ప్రాజెక్టు ద్వారా గ్రావిటీతో నీరు ఇవ్వాలని పనిచేస్తున్నామన్నారు. అలాగే 2019నాటికి ప్రాజెక్టును పూర్తిచేస్తామన్నారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టిన పరిస్థితుల్లో కాంక్రీట్ పనులను మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్తామన్నారు. స్పిల్‌వే పనుల్లో దాదాపు 16లక్షల క్యూబిక్‌మీటర్ల మేరకు కాంక్రీట్ పనులు చేయాల్సి ఉంటుందన్నారు. కాగా ఇప్పటికే పూర్తయిన పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా ఈసీజన్‌లో వంద టిఎంసిల జలాలను కృష్ణాకు తరలించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15కి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణపనులను వేగవంతం చేస్తామన్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తూ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈమధ్య వచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి ఎందుకిచ్చారని ప్రశ్నించటం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.
చరిత్రలో ఏనాడూ లేనివిధంగా కాల్వలకు ఈనెల 1వ తేదీనే నీటి సరఫరా ప్రారంభించామని, దీనివల్ల రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించి ముందుకు వెళ్లాలని, ఇదే సమయంలో రెండవ పంటకు కూడా వారు ముందుగానే సన్నాహాలు చేసుకోవాలని చెప్పారు. చివరిలో అవకాశాన్ని బట్టి మూడవ పంటగా మినుము వంటివి వేసుకోవడానికి అనుమతిస్తామని చెప్పారు. ఈసందర్భంగా కొంతమంది విలేఖరులు అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో వర్షపునీరు లీకేజీలు, అనంతర పరిణామాలపై అడిగిన ప్రశ్నలకు సిఎం స్పందిస్తూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఉన్నప్పుడు అలాంటి చిన్నచిన్న అంశాలపై మాట్లాడటం అనవసరమని పేర్కొన్నారు.

చిత్రం.. ఐకానిక్ బ్రిడ్జి నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు