రాష్ట్రీయం

ముదిరిన విద్యుత్ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం ముదిరింది. తమకు ఆంధ్రప్రదేశ్ రూ. 1676కోట్ల బకాయిలను వెంటనే చెల్లించని పక్షంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని తెలంగాణ ట్రాన్స్‌కో లేఖ రాసింది. అంతకు ముందు ఆంధ్ర ట్రాన్స్‌కో తమకు రూ. 3128కోట్ల బకాయిలను తెలంగాణ ట్రాన్స్‌కో చెల్లించాలని, లేని పక్షంలో ఈ నెల 11వ తేదీ ఆదివారం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని రెండోసారి నోటీసు ఇచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రాచుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు 53.88శాతం తెలంగాణకు, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిలో 46.11శాతం ఆంధ్రాకు విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉంది. దీని ప్రకారం తెలంగాణ నుంచి ఆంధ్రకు 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. అదేవిధంగా ఆంధ్ర నుంచి తెలంగాణకు 1200మెగావాట్ల విద్యుత్ సరఫరా అవుతోంది. బకాయిల వివాదంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని, సామరస్యంగా పరిష్కరించుకుందామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకరరావు గురువారం ఏపి జెన్కోకు లేఖ రాశారు. ఏపి జెన్కోతో తమకు రావాల్సిన బకాయిల బిల్లులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, దీనివల్ల ఎవరెంత బకాయి ఉన్నారో బహిర్గతమవుతుందని, వీటిని సర్దుబాటు చేసుకుందామని తెలంగాణ ట్రాన్స్‌కో పేర్కొంది. ఆంధ్ర జెన్కో అధికారులు తమ ప్రతిపాదనలను పెడచెవిన పెట్టారని ప్రభాకరరావు తెలిపారు. తమ ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఎంతసేపు తెలంగాణ డిస్కంలు తమకు బకాయిలు ఉన్న విషయాన్ని మాత్రమే హైలైట్ చేస్తున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ ప్రాంత విద్యుత్ సంస్థలు విద్యుత్ రంగంలో వౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాయన్నారు. ఉమ్మడి ఆంధ్రలో హైదరాబాద్ సిపిడిసిఎల్ పరిధిలో కర్నూలు, అనంతపురం జిల్లాలు ఉండేవన్నారు. ఈ రెండు జిల్లాల్లో పెట్టుబడులు పెడితే ఈ బకాయిలను ఆంధ్ర విద్యుత్ సంస్థలు తమకు చెల్లించాల్సి ఉందన్నారు. విభజన జరిగి మూడేళ్లు గడిచినా, ఇవేమీ పట్టించుకోకుండా ఎంతసేపు బకాయిల విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ సెటిల్ చేయాలని ఏపి జెన్కో అంటోందన్నారు. ఈ వివాదం పరిష్కారానికి చర్చలు ఒక్కటే పరిష్కారమన్నారు. ఏపి విద్యుత్ సంస్థలు తాము సరఫరా చేస్తున్న విద్యుత్‌కు రూ. 1676 కోట్ల బకాయిలు చెల్లించనందు వల్ల ఆర్ధికపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు.
తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని తెలంగాణ విద్యుత్ వర్గాలు తెలిపాయి. తమకు ఆంధ్రా నుంచి 1200 మెగావాట్ల విద్యుత్ వస్తుంటే, తెలంగాణ 800 మెగావాట్ల విద్యుత్‌ను ఏపికి సరఫరా చేస్తోంది. పరస్పరం విద్యుత్ నిలిపివేస్తే, తెలంగాణకు 400 మెగావాట్ల విద్యుత్ మాత్రమే నిలిచిపోతుంది. దీని వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ లేదని, మార్కెట్‌లో తక్కువ ధరకే విద్యుత్ లభ్యమవుతోందని తెలంగాణ విద్యుత్ వర్గాలు తెలిపాయి. ఏపి విద్యుత్ శాఖ అధికారులు మాత్రం తమకు రూ. 3128కోట్ల బకాయిలను తెలంగాణ చెల్లించాలంటున్నారు. సింగరేణి కూడా తమకు బొగ్గునిలిపివేసిందన్నారు. సింగరేణికి దాదాపు రూ.1600కోట్ల బకాయిలు ఏపి చెల్లించాల్సి ఉంది. ఈ సొమ్మును సర్దుబాటు చేసేందుకు తెలంగాణ విద్యుత్ శాఖ సిద్ధంగా ఉన్నా, సింగరేణి మాత్రం తమకు సర్దుబాటు చేస్తే ఉపయోగం లేదని, రూ. 1600 కోట్ల బకాయిలు చెల్లించాలంటున్నారు. ఈ బకాయిల వివాదం కేంద్రానికి ఉభయ రాష్ట్రాలు తెలియచేశాయి. ఈ నెల 9న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రానున్నారు. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఏపి జెన్కో యోచిస్తోంది.