రాష్ట్రీయం

ముత్యపు కవచంతో మెరిసిన మలయప్పస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 8: తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్న జ్యేష్ఠ్భాషేకంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపుకవచంతో మెరిసిపోయారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణలో గల కల్యాణ మండపంలో జరుగుతున్న జ్యేష్ఠ్భాషేకం గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు హోమాలు, స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారికి ముత్యపుకవచం అలంకరించి తిరువీధుల్లో ఊరేగించారు. ముత్యపు కవచంలో శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్న భక్తులు మురిసిపోయారు. ఈ ఉత్సవ నేపథ్యంలో గురువారం తిరుప్పావడ, వసంతోత్సవం, 9వ తేదీన తోమాల సేవ, అర్చన, నిజపాదదర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో చిన్నజియ్యర్ స్వామి, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు, ఓఎస్‌డి పాలశేషాద్రి తదితర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.