రాష్ట్రీయం

ఇక భూదందాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: రాష్ట్రంలో ఇటీవల కాలంలో తరచుగా వెలుగుచూస్తున్న భూకుంభకోణాలను అరికట్టేందుకు ఒక వినూత్న ప్రతిపాదనను ఉన్నతాధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్లారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను విలీనం చేయడం వల్ల ప్రభుత్వ భూములను అక్రమంగా విక్రయం, రిజిస్ట్రేషన్లు చేయడాన్ని నిరోధించవచ్చనే అంశాన్ని ప్రభుత్వం కూడా యోచిస్తోంది. ఈ ప్రతిపాదనను ఆర్ధిక, రెవెన్యూ శాఖలు పరిశీలిస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖను విలీనం చేస్తే స్ధానిక తాస్హిల్దార్లు సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేయాల్సి ఉంటుంది. చాలామంది సబ్‌రిజిస్ట్రార్లకు ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూములకు మధ్య ఉన్న వ్యత్యాసం తెలియదు. అలాగే భూయజమాని ఎవరో గుర్తించే పరిస్ధితి ఉండదు. అలాగే రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మధ్య సమన్వయం కూడా లేదు. అదే రెవెన్యూ శాఖలో ఉండే అధికారికి ప్రభుత్వ భూమి, అసైన్డ్భూమి, పోరంబోకు భూముల వివరాలు కూలంకషంగా తెలుసు. ఈ రెండు శాఖలను విలీనం చేస్తే నకిలీ రిజిస్ట్రేషనన్ల బెడద ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖనే రిజిస్ట్రేషన్ల విధులను నిర్వహిస్తుంది. మియాపూర్, బాలాపూర్ భూ స్కాంలు వెలుగుచూడడంపై భవిష్యత్తులో ఈ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యంత విలువైన భూమి హైదరాబాద్‌మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో ఉంది. దాదాపు 15వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి న్యాయపరమైన చిక్కుల్లో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌ఎండిఏ పరిధిలో దాదాపు మూడు వేల ఎకరాల భూమి లిటిగేషన్లలో ఉండగా, ఆరు వందల ఎకరాల భూమి భూ ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. ఈ కేసుల్లో ప్రభుత్వానికి చెందిన భూములు ఉండడంతో, వీటి కోసం ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోంది. రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో 8వేలకుపైగా ఎకరాలను వేలం వేయాలని హెచ్‌ఎండిఏను ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో 3000 ఎకరాల భూమి వివాదాల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది పోనూ హెచ్‌ఎండిఏ పరిధిలో జవహర్ నగర్‌లలో 2250 ఎకరాలు, కోకాపేటలో 640 ఎకరాలు, మియాపూర్‌లో 600 ఎకరాలు హెచ్‌ఎండిఏ పరిధిలో లిటిగేషన్ లేకుండా ఉన్నాయి. 2007 నుంచి 2012 మధ్య దాదాపు 1500 ఎకరాలను హెచ్‌ఎండిఏ వేలం వేసి ప్రభుత్వ ఖజానాకు రూ. 1500 కోట్ల నగదును తెచ్చిపెట్టింది. ప్రభుత్వ భూములను పర్యవేక్షించేందుకు, కాపాడేందుకు ప్రభుత్వ పరంగా అధికారాలు ఉన్నశాఖ లేకపోవడం కూడా లోపమని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మియాపూర్ భూ స్కాంలో భూమి బదలాయింపు కాగితాలకు పరిమితమైనప్పటికీ, హెచ్‌ఎండిఏ వెంటనే మేల్కొని తమ పరిధిలోని భూమిని పరిరక్షించేందుకు వంద మంది సెక్యూరిటీ గార్డులను నియమించింది. అమీర్‌పేట, మియాపూర్, కోకాపేట, జవహర్‌నగర్ భూములను కాపాడేందుకు హెచ్‌ఎండిఏ ఈ గార్డులను నియమించింది. హైదరాబాద్ జిల్లాలో 299 ఎకరాల్లో 262 ఎకరాల భూమిని హెచ్‌ఎండిఏ వినియోగించగా, ఇంకా 36.36 ఎకరాల భూమి ఉంది. హెరిటేజ్, ఆక్రమణల కింద 22.23 ఎకరాల భూమి ఉంది. మెదక్ జిల్లాలో మొత్తం 558 ఎకరాల్లో 121.14 ఎకరాల భూమిని వినియోగించారు. ఇంకా 437.10 ఎకరాల భూమిని వినియోగించలేదు. కోర్టు కేసుల్లో 224 ఎకరాలు ఉంది.