రాష్ట్రీయం

అంబానీ.. తొలి బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 10: విశాఖ జిల్లా రాంబిల్లివద్ద ఐదు వేల కోట్లతో అణు జలాంతర్గామి నిర్మాణ ప్రాజెక్ట్ (న్యూ వరల్డ్‌క్లాస్ నేవీ ఫెసిలిటీ ప్రాజెక్ట్)ను స్థాపించనున్నట్టు రిలయన్స్ ఎడిఎ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలో మూడు రోజులపాటు జరిగే భాగస్వామ్య సదస్సు ఆదివారం ప్రారంభమైంది. అనిల్ అంబానీ పెట్టుబడి ప్రకటనతో సదస్సు ప్రారంభం కావడం గమనార్హం. ఈ సందర్భంగా అంబానీ మాట్లాడుతూ భారతదేశం సూపర్ పవర్‌గా ఎదగాలంటే సముద్ర రవాణా వ్యవస్థ పటిష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర జలాల పరిరక్షణకు భారత నౌకాదళం అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. పొరుగు దేశాలతో పోలిస్తే, భారత నౌకాదళం యుద్ధ నౌకలను, జలాంతర్గాములను, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లను మరిన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా 72 సబ్ మెరైన్‌లను కలిగి ఉంది. చైనా వద్ద 63 సబ్ మెరైన్‌లున్నాయి. కానీ భారత నౌకాదళంలో కేవలం 17 సబ్ మెరైన్‌లు మాత్రమే ఉన్నాయని అంబానీ వెల్లడించారు. అందుకే న్యూక్లియర్ సబ్ మెరైన్ నిర్మాణంలో తమవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే రక్షణ రంగంలోనూ పెట్టుబడులకు రిలయన్స్ గ్రూప్ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో రిలయల్స్‌కు చెందిన 15 వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని అనిల్ గుర్తు చేశారు.
బాబు అత్యంత సమర్థుడు
ఇదిలావుంటే, సిఎం చంద్రబాబును అనిల్ అంబానీ ఆకాశానికెత్తేశారు. ఆధునిక భారత దేశ రూపకల్పనకు సమర్థవంతమైన నాయకత్వం అవసరమని, ప్రధాని మోదీ, సిఎం చంద్రబాబు ఇందుకు తగినవారని అన్నారు. తన తండ్రి జీవించివున్న సమయంలో ఎన్టీఆర్‌ను ఒక సందర్భంలో కలిశారని, అక్కడే చంద్రబాబు కూడా ఉన్నారని అంబానీ చెప్పారు. అప్పుడే చంద్రబాబు సమర్థత గురించి తన తండ్రి తనకు చెప్పారని అనిల్ ప్రశంసించారు. ఎన్టీఆర్ కలలు నెరవేర్చగల శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయని తన తండ్రి ఆనాడే గుర్తించారని, ఇప్పుడు అది నిజమని రాష్ట్ర ప్రజలే కాదు, దేశం కూడా నమ్ముతోందన్నారు. దేశంలో వరల్డ్ క్లాస్ బిజినెస్ స్కూల్స్ నెలకొల్పాలన్న సంకల్పంతో తానున్న సమయంలో చంద్రబాబు నుంచి తనకు ఫోన్‌కాల్ వచ్చిందని అనిల్ గుర్తు చేసుకున్నారు. ఒక బిజినెస్ స్కూల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయమని కోరారని, ఆయన కోరిక మేరకు తాను ఆ స్కూల్‌ను అక్కడ నెలకొల్పానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పెరిగి పెద్దదైన ఆ స్కూల్ భారతదేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. చంద్రబాబు పాలనాదక్షతపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం ఉందన్నారు. పారదర్శకత, సమర్థత కలిగిన చంద్రబాబు ముఖ్యమైన విషయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారని అనిల్ ప్రశంసించారు. అలాగే ఆయన తనయుడు లోకేష్ కూడా ఎన్టీఆర్, చంద్రబాబు కలలను నెరవేర్చుతారన్న ఆశాభావాన్ని అనిల్ వ్యక్తం చేశారు.

చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న అనిల్ అంబానీ