రాష్ట్రీయం

ఎంత ఖర్చయినా సరే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ధాన్యం సేకరణకు ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని, ఎప్పటికప్పుడు రైతులకు చెల్లింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ధాన్యం సేకరణకు నాలుగు వేల కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. మరో వెయ్యి కోట్ల రూపాయలు వెంటనే చెల్లించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత పంట ఈసారి పండిందని, దాని ఫలితంగా సివిల్ సప్లయిస్ కొనుగోలు కేంద్రాలకు రికార్డు స్థాయిలో ధాన్యం వస్తోందని చెప్పారు. అయినప్పటికీ ఎంత ధాన్యమైనా సేకరించడానికి అవసరమైన నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆ డబ్బులు ఎలాంటి జాప్యం లేకండా తక్షణం రైతులకు చేరే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్టస్థ్రాయిలో నిధుల విడుదల జరిగినా రైతులకు చేరే వరకు కొంత సమయం పడుతున్నదని, ఈ జాప్యం నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం సమావేశం నిర్వహించారు. గత ఏడాది తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, ఈసారి ఇప్పటికే 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని అధికారులు చెప్పారు. మరో రెండు లక్షల టన్నుల ధాన్యం రావచ్చునని అధికారులు చెప్పారు. 2013-14లో గరిష్టంగా 17లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, ఈసారి దానికి రెండున్నర రేట్లు అదనంగా ధాన్యం సేకరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 37లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, దీనికి 5300 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, నాలుగువేల కోట్ల రూపాయలు చెల్లించినట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. మరో వెయ్యి కోట్ల రూపాయలు తక్షణం చెల్లించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఎఫ్‌సిఐ నుంచి రావలసిన డబ్బులు వచ్చేదాకా ఎదురు చూడకుండా వెయ్యి కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీని కోసం ప్రభుత్వం తరఫున బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఖరీఫ్ పెట్టుబడులకు రైతులకు డబ్బులు అత్యవసరం కాబట్టి అధికారులు రైతులకు వెంటనే చెల్లింపులు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. చెల్లింపులపై రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, వెంట వెంటనే చెల్లింపులు చేయాలని సూచించారు.