రాష్ట్రీయం

మేజర్లయితే ఎఫ్‌ఐఆర్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ప్రేమ వివాహాలకు సంబంధించి యువతీ, యువకుడు మేజర్లని రుజువు ఉంటే ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక)ను నమోదు చేయవద్దని హైకోర్టు రెండు రాష్ట్రాల డిజిపిలను ఆదేశించింది. ఈ సమాచారాన్ని రెండు రాష్ట్రాల్లోని పోలీసు స్టేషన్లకు అందించాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ వివాహనం నిర్బంధం, వత్తిడి, పలుకుబడి, మత్తు ప్రయోగం తదితర అంశాల వల్ల జరిగిందని రుజువైతే తప్ప ఎఫ్‌ఐఆర్ నమోదు చేయరాదని హైకోర్టు పేర్కొంది. ఈ తీర్పును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఇచ్చారు. తల్లితండ్రులు తమ కుమార్తె మిస్సయినట్లు లేదా కిడ్నాపైనట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, దర్యాప్తులో ఇది మిన్సింగ్ లేదా కిడ్నాప్ కేసు కాదని రుజువైతే కేసు మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే ప్రేమ వివాహం జరిగినట్లు తెలిస్తే, పరస్పరం సమ్మతితో జరిగితే, ఇద్దరు మేజర్ అయితే కోర్టుకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు ప్రధానంగా శాంతిభద్రతలు పరిరక్షించే విధంగా విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వేరు వేరు కులాలు, మతాలకు చెందిన యువతి, యువకుల మధ్య వివాహం జరిగితే, ఈ విషయం పోలీసుల దృష్టికి వస్తే, ఈ కేసులను జాగ్రత్తగా పరిష్కరించాలని ఆదేశించింది. తల్లితండ్రుల అంగీకారం లేకుండా వివాహం చేసుకున్న మేజర్ల కేసులో అప్రమత్తతతో పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు హితవు పలికింది. తమ పిల్లలు మతాంతర, కులాంతర వివాహం చేసుకున్నప్పుడు, నూతన వధూవరులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారని హైకోర్టు పేర్కొంది. తమ తల్లితండ్రులు ఈ విషయమై పోలీసు స్టేషన్లను ఆశ్రయించినప్పుడు వారు వ్యధ చెందుతారని హైకోర్టు తెలిపింది. ‘21వశతాబ్ధంలో మనం ఉన్నాం. కాని తమ పిల్లలు కులాంతర, మతాంతర వివాహం చేసుకుంటే తల్లితండ్రుల మైండ్ సెట్ ఇంకా 18వ శతాబ్ధపు ఆలోచనలతో ఉంటుంది అని హైకోర్టు పేర్కొంది. చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలకు మతాంతర, కులాంతర వివాహాలు చేస్తామని చెబుతుంటారు. ఈ విషయమై మాట్లాడుతారు, రాస్తారు. నిజంగా ఈ సమస్య తమకు ఎదురైనప్పుడు, అంతకుముందు తాము చేసిన ప్రసంగాలకు కట్టుబడి ఉండరని హైకోర్టు పేర్కొంది. ఈ రోజుల్లో ప్రతి విద్యావంతుడు తాను కుల వ్యవస్థను విశ్వసించనని ప్రకటనలు చేస్తుంటాడు. అన్ని మతాలను ప్రేమిస్తామంటారు. అదే తమ పిల్లలు ఇతర వర్గాల వారితో ప్రేమలోపడితే, ఉన్నత కులాలు, నిమ్నకులాలు, మతాల వ్యవహారాల గురించి కచ్చితంగా ఆలోచిస్తారు అని హైకోర్టు తీర్పులో తెలిపింది. పిల్లల తమ అభిప్రాయాలతో ఏకీభవించనప్పుడు, పెద్దలు పిల్లల భవిష్యత్తును వారి నిర్ణయానికి వదిలివేయాలని హైకోర్టు పేర్కొంది. ఈ దేశంలో యువతకు ఎంతో ముందు చూపుతో ఆలోచించే శక్తి ఉందని కోర్టు పేర్కొంది. వారిని ఎవరూ నియత్రించలేరు. మతాంతర, కులాంతర వివాహాలు చేసుకోవడం వారి ఇష్టం అని హైకోర్టు తీర్పులో పేర్కొంది.