రాష్ట్రీయం

భోజగుట్టను భోంచేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: హైదరాబాద్‌లోని భోజగుట్ట భూముల అన్యాక్రాంతంపై సిసిఎస్ పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించారు. వివిధ సర్వే నెంబర్లలో ఉన్న దాదాపు 900 ఎకరాలు కబ్జాకు యత్నించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కీలక సూత్రధారి శైలేష్ సక్సేనా, అతని అనుచరుడు శ్రీనివాసరావుగా గుర్తించారు. భోజగుట్టలో వివాదాస్పద భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి సహా ముగ్గురు నిందితులు చంచల్‌గూడ జైల్లో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా సిసిఎస్ పోలీసులు ఈ కేసులో కీలక సూత్రధారి శైలేష్ సక్సేనా, దీపక్‌రెడ్డిలను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, జుడిషియల్ రిమాండ్ ముగిసిన తరువాతే పోలీస్ కస్టడీ పిటిషన్‌పై విచారించనున్నట్టు తెలిసింది.
కాగా, సిసిఎస్ పోలీసులు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా చేసిన అక్రమాలపై మరింత సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు. పదేళ్ల నుంచి తప్పుడు పత్రాలు సృష్టిస్తూ, స్థలం హక్కుదారులను బెదిరిస్తున్నారని బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. శైలేష్ సక్సేనా అనుచరుడు ఆర్ శ్రీనివాసరావు, దీపక్‌రెడ్డి డ్రైవర్ తిరుపతిరెడ్డిలు వివాదాస్పద భూములను గుర్తించి సక్సేనాకు సమాచారమిస్తే..ఆయన తప్పుడు పత్రాలు సృష్టించడం, ఇందుకోసం లేని మనుషులను తెరపైకి తేవడం వంటివి చేశారు. అనంతరం కోర్టుల్లో కేసులు వేసి ఈ భూములు తమవేనంటూ అధికారికంగా ఉత్తర్వులు సంపాదించుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. వీరిపై ఇప్పటికే సిసిఎస్‌లో నాలుగు కేసులున్నట్టు అదనపు డిసిపి జోగయ్య తెలిపారు.
భోజగుట్టలో భూకబ్జా వివరాల్లోకి వెళితే...
సర్వే నెంబర్ 294 నుంచి 299 వరకు..రూ. 400 కోట్ల విలువైన 78.22 ఎకరాలు, ఈ భూమికి సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టించగా, దీపక్‌రెడ్డి సహా మరో ఆరుగురి పేరుమీద 2008లో రిజిస్ట్రేషన్ చేశారు.