రాష్ట్రీయం

మెరిసిన తెలుగు తేజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/విజయవాడ, జూన్ 11: ఐఐటి-జెఇఇ 2017 అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు ప్రతిభ చూపించారు. మద్రాస్ ఐఐటి ఈ పరీక్షలను నిర్వహించింది. ఎపి ఎంసెట్‌లో మొదటి ర్యాంక్, తెలంగాణ ఎంసెట్‌లో 5వ ర్యాంక్ సాధించిన మోహన్ అభ్యాస్‌కు ఐఐటి జెఇఇలో 64వ ర్యాంక్ లభించింది. తెలంగాణ ఎంసెట్‌లో 10వ ర్యాంక్ సాధించిన నిఖిల్‌కు ఐఐటి-జెఇఇలో 248వ ర్యాంక్ లభించింది. ఎస్సీ కేటగిరిలో కాకినాడకు చెందిన రోహన్ అభిషేక్ జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించాడు. ఇతనికి జెఇఇ మెయిన్‌లో నాలుగో ర్యాంక్ లభించింది. ఆలిండియా ఎస్టీ కేటగిరిలో విజయవాడ విద్యార్థి అజిత్ నాయక్ 23వ ర్యాంక్ సాధించాడు.పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడేనికి చెందిన నామా హరికృష్ణ ఓపెన్ కేటగిరిలో జాతీయ స్థాయిలో 60వ ర్యాంక్ సాధించారు. తెలంగాణలోని గిరిజన గురుకులాలకు చెందిన 33 మంది విద్యార్థులు సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలకు చెందిన 25 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఎస్‌టి క్యాటిగిరీలో తెలంగాణకు చెందిన దేవేందర్ నాయక్ 167వ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా 23 ఐఐటిలు ఉండగా, వివిధ కోర్సుల్లో 11వేల సీట్లున్నాయి. 2017 మే 21 న జరిగిన ఐఐటి-జెఇఇ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.74లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, ఎపి, తెలంగాణ రాష్ట్రాల నుండి 29వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఐఐటి-జెఇఇలో జాతీయ స్థాయిలో చంఢీగఢ్‌కు చెందిన సర్వేష్ మోహంతి ఫస్ట్ ర్యాంక్ సాధించగా, పూణేకు చెందిన అక్షిత చౌగ్, ఢిల్లీకి చెంది అనన్య అగర్వాల్ రెండోర్యాంక్ సాధించారు. ఐఐటి జెఇఇ పరీక్షా పత్రంలో తప్పులు దొర్లడంతో 11 మార్కులను బోనస్‌గా కలిపారు. ఐఐటిల్లో చేరే విద్యార్థులు ఈ నెల 15 నుండి 19 వరకు ఆప్షన్లు ఇవ్వవచ్చని అధికారికంగా ప్రకటించారు. జూన్ 19 న సీట్ల కేటాయింపు ఉంటుంది. కాగా జెఇఇ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో విజయవాడ నిడమానూరు నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మైక్రో షెడ్యూల్స్ ద్వారా శిక్షణ ఇవ్వడం వల్లే తాము విజయం సాధించగలిగామని విద్యార్థులు తెలిపారు. భవిష్యత్తులో సాంకేతిక రంగం వైపు అడుగులు వేసి నూతన ఆవిష్కరణల కోసం కృషి చేస్తానని అజిత్ నాయక్ తెలిపాడు. అడ్వాన్స్‌డ్‌లో 60వ ర్యాంక్ సాధించిన హరికృష్ణది రైతు కుటుంబం. ఇతని తల్లితండ్రులు నాగేశ్వరరావు, ధనలక్ష్మి వ్యవసాయం చేస్తుంటారు. జెఇఇ మెయిన్‌లో హరికృష్ణ 141వ ర్యాంక్ సాధించాడు.

చిత్రం.. జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులతో అధ్యాపకులు