రాష్ట్రీయం

పదండి బడికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్ట్ర చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో 2017-18 నూతన విద్యా సంవత్సరంలో సోమవారం ప్రభుత్వ పాఠశాలలు ఉద్రిక్త పరిస్థితుల్లో పునఃప్రారంభం కాబోతున్నాయి. వేసవి సెలవుల్లోనే బదిలీలు జరగాలంటూ అన్ని ఉపాధ్యాయ సంఘాలు గత విద్యా సంవత్సరం ముగియటానికి ముందునుంచే ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పైగా దొడ్డిదారిన బదిలీలు చేయటంపై ఆయా సంఘాలు భగ్గుమన్నాయి. అప్పటికే రాష్టవ్య్రాప్తంగా 100 బదిలీలు జరగ్గా లక్షలాది రూపాయలు చేతులు మారాయంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపలు చేశారు. పాఠశాలల విద్యా కమిషనర్ కార్యాలయంతో పాటు విశాఖలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయాన్ని సైతం ముట్టడించారు. మొత్తంపై ప్రభుత్వం హడావుడిగా బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించగా ఆ జీవో తప్పులతడక అంటూ ఉపాధ్యాయులు మళ్లీ ఆందోళనకు దిగారు. రాష్టవ్య్రాప్తంగా మొత్తం 61,528 పాఠశాలలు ఉండగా వీటిల్లో ప్రభుత్వ పాఠశాలలు 44,654 కాగా మిగిలినవి ఎయిడెడ్, మున్సిపల్ పాఠశాలలు. మరోవైపు సిలబస్‌లో మార్పులేమీ లేకపోయినప్పటికీ నేటివరకు పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరలేదు. 60 శాతం పుస్తకాలు నేటికీ మండల కేంద్రాలకే చేరలేదు. పెద్దసంఖ్యలో ఎంఇవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ప్రభుత్వం గత విద్యా సంవత్సరం పరీక్షల సమయంలోనే తొలుత మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దుచేయాలనే నిర్ణయం తీసుకోగా అన్ని స్థాయిల నుంచి ప్రారంభమైన ఆందోళనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. మరోవైపు బదిలీల్లో గందరగోళం నెలకొనటంతో ఉపాధ్యాయులెవరూ బోధనపై దృష్టి సారించే అవకాశం కనిపించటం లేదు. అన్నింటికీ మించి రేషనలైజేషన్ ఉపాధ్యాయులనే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులనూ కలవర పెడుతోంది. వేలాది పాఠశాలలు మూతబడతాయనే ప్రచారం సాగుతోంది.