రాష్ట్రీయం

నీట్ ఫలితాలకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: మెడికల్, డెంటల్ కోర్సుల్లో చేరేందుకు సిబిఎస్‌ఇ నిర్వహించిన (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు) -నీట్ 2017 ఫలితాలు విడుదల చేసేందుకు మార్గం సుగమమైంది. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న 12 లక్షల మంది అభ్యర్ధులకు ఊరటనిస్తూ సుప్రీంకోర్టు జస్టిస్ పిసి పంత్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ -2017 ఫలితాలను విడుదల చేసేందుకు సిబిఎస్‌ఇకి అనుమతి ఇచ్చింది. దాంతో ఫలితాల విడుదలకు సిబిఎస్‌ఇ కసరత్తు మొదలుపెట్టింది. మంగళవారం ఒఎంఆర్ షీట్లను వెబ్ పోర్టల్‌లో విడుదల చేయనుంది. తొలి కీని జూన్ 15న విడుదల చేయనుంది. దానిపై అభ్యంతరాలకు అభ్యర్ధులకు జూన్ 16 సాయంత్రం ఐదు గంటల వరకూ గడువు విధించింది. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటీషన్లను దృష్టిలో ఉంచుకుని నీట్ ఫలితాలను విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ మే 24న సిబిఎస్‌ఇ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. సిబిఎస్‌ఇ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ హాజరై ఫలితాల విడుదలకు సిబిఎస్‌ఇకి అనుమతివ్వాలని కోరారు. ఉన్నత న్యాయస్థానం నీట్ నిర్వహణకు సంబంధించి ఒక షెడ్యూలును ఇచ్చిందని, అయితే ప్రస్తుతం దాఖలైన పిటీషన్ల వల్ల షెడ్యూలు పాటించడం ఇబ్బంది అవుతోందని సిబిఎస్‌ఇ వాదించింది.
గత పక్షం నీట్ ఫలితాల విడుదలను నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తాజాగా స్టే విధించింది. మెడికల్ ఎగ్జామినేషనల్ షెడ్యూలులో హైకోర్టు కలుగజేసుకోరాదని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. ఈనెల 26లోగా నీట్ ఫలితాలు విడుదల చేయాలని సిబిఎస్‌ఇని ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2017 ఫలితాలను ప్రకటించరాదని మద్రాస్ హైకోర్టు సిబిఎస్‌ఇని ఆదేశించింది. తమిళ, ఆంగ్ల భాషల్లోని ప్రశ్నాపత్రాల్లో తేడా ఉందని ఆరోపిస్తూ తమిళనాడు విద్యార్థుల పిటీషన్ మేరకు మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ, సిబిఎస్‌ఇ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం సోమవారం నీట్ ఫలితాలకు మార్గం సుగమం చేసింది. ఇకపై నీట్ -2017కి సంబంధించిన పిటీషన్లను విచారించరాదంటూ ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది.