రాష్ట్రీయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూన్ 12: సిరిసిల్ల గడ్డపై పురుడు పోసుకుని జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించి, పుట్టిన ఊరుకు, నీడ నిచ్చిన ప్రాంతానికి పేరు తీసుకవచ్చిన సింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి కళ్ళు మూసిన వార్త..సిరిసిల్ల పూర్వ పాత తాలూకా నేటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకాన్ని దుఃఖ సాగరంలో ముంచెత్తింది. సాహితీ లోకం పెద్ద దిక్కును కోల్పోయింది. అతడి అడుగు జాడల్లో పయనిస్తూ.. ఆతని ఆశీస్సులతో ఎదిగిన ఎందోరో కవులు, రచయితలు ‘పెద్దన్న’ను కోల్పోయినట్టయింది.
హన్మాజిపేట-వేములవాడ-సిరిసిల్ల ఈమూడు కలిస్తేసింగిరెడ్డి సత్యనారాయణరెడ్డి బాల్యం. ఆ మూడింటి సంక్షిప్త రూపంగా సినారెగా సిరిసిల్ల పాత తాలూకాల ప్రజల మనస్సుల్లో సినారె నిలిచిపోయారు. సిరిసిల్ల ప్రజల మనసులపై చెరిగి పోని ముద్ర వేశారు. సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మల గారాల బిడ్డగా ‘రైతు’ ఇంట జన్మించిన సినారె..నైజాం పాలనాకలాంలో గ్రామ గ్రామాన గృహాలలో ఏర్పాటు చేసుకున్న ‘కాన్గిరి’ బడిలో హన్మాజిపేటలో ఆ తర్వాత వేములవాడలో, ఆ తర్వాత సిరిసిల్ల మిడిల్ స్కూల్ నేడు బాలుర ఉన్నత పాఠశాల శివనగర్‌గా పిలుస్తున్న పాఠశాలలో 6,7 తరగతుల మాధ్యమిక విద్యాభ్యాసాన్ని ఉర్దూ మీడియంలో చదివారు. ఆ సమయంలో తెలుగు ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా మాత్రమే ఉండింది. తర్వాత కరీంనగర్‌లో 10వ తరగతి హైదరాబాద్‌కు వెళ్ళి ఇంటర్ నుంచి డిగ్రీ, పిజి వరకు చదివారు. ఆ తర్వాత డాక్టరేట్ కూడా చేశారు. హన్మాజిపేటలో ప్రాధమిక విద్యాభ్యాసం చేసిన సమయంలో బాల్య మిత్రులు సిరిసిల్లలో సైతం ఉండగా, ఇక్కడ మాధ్యమిక తరగతులలో వారంతా కలిసి చదివారు. గూడూరి, మడుపు, ఆడెపు కుటుంబాలతో బాల్య స్నేహ సంబంధాలు కలిగిన సినారె సిరిసిల్లకు వచ్చినప్పుడల్లా వారిని కలవడం, వారు హైదరాబాద్‌కు వెళ్ళినపుడు సినారెను కలవడం జరిగేది. అతనిని స్ఫూర్తిగా తీసుకుని హన్మాజిపేటకు చెందిన ఎందరో కవులు, రచయితలుగా రాణించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, కన్నతల్లిని, పుట్టిన ఊరును, విద్య బోధించిన గురువులను మరచి పోకూడదని విశ్వసించే సినారె సిరిసిల్లలో 1989లో యువ సాహితీ కళా పరిషత్‌ను, 1992లో మానేరు రచయితల సంఘంగా పేరు మార్చకున్న సందర్భంగా అర్ధ దశాబ్ద ఉత్సవాలకు సిరిసిల్లకు వచ్చారు. అపుడు 65 సంవత్సరాలు నిండిన సందర్భంగా 65 వసంతాల సినారె పేరుతో అభినందన సంకలనాన్ని తెచ్చారు. అపుడు 64 మంది కవి పండితులకు సినారె చేతుల మీదుగా సన్మానించారు. ఆ సందర్భంగా తన గురువు జి.రాములును సత్కరించే అవకాశం సినారెకు రాగా, సినారె 65 వసంతాల పేరిట సన్మానించే అవకాశం మారసంకు వచ్చింది. అపుడు ఆయన అన్న మాటలు ‘ఎవరికి ఈ సన్మానం?’ చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగా సింగిరెడ్డి బుచ్చమ్మగా, కమ్మగా నను కని పెంచిన మా హనుమాజిపేటకు ఈ సన్మానం’ ఈ మాటలు నాటి సమావేశంలో పాల్గొన్న ఎందరి చెవుల్లోనో ఇవి మారుమ్రోగుతునే ఉన్నాయి. ఈ తర్వాత 1997లో రాజ్యసభ సభ్యుడైన సందర్భంలో వేములవాడకు సినారె కళామందిరం ఏర్పాటుకు సినారె తన నిథుల నుంచి కేటాయింపులు జరిపారు. 1998 చివరి నెలల్లో సిరిసిల్ల కళాసాగర్ అధ్యక్షులు దివంగత రుద్ర రవి నేతృత్వంలో కవులు, రచయితలు, స్థానిక నేతలు సినారెను కలిసి సిరిసిల్ల కళామందిరం నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రూ.35 లక్షలు మంజూరు చేయగా, సినారె చేతుల మీదుగా 1999, జనవరి 9న శంకుస్థాపన చేయగా, సుధీర్ఘకాలం నిర్మాణం అనంతరం 2005, మార్చి 7న సినారె కళా మందిరం అధికారికంగా ప్రారంభమైంది. సినారె నీడలో ఏకలవ్య శిష్యులుగా సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ఎందరో కవులు రాణించారు. డా.పత్తిపాక మోహన్ సినారెకు నివాలి అర్పిస్తూ అంటారు.. సిరిసిల్ల అంటే మాకు చేనేత, సిరిసిల్ల అంటే ఎంకన్న గుడి, సిరిసిల్ల అంటే మానేరు, సిరిసిల్ల అంటే సినారె. మూడు దశాబ్దాలుగా సినారెతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దీనికి వారధి అయిన గూడూరి సీతారాంను, తొలి అడుగుల నడకల నుంచి తన పెండ్లి కవిత్వం, అన్నీ సినారె ఆశీర్వాదాభినందనలతో సాగాయంటారు. కొసమెరుపు ఏమిటంటే సినారె 14వ సమగ్ర సంకలనాన్ని మారసం ద్వారా ఆవిష్కరణ, వారం క్రితం సినారె ఫోటోతో ప్రచురించిన మారసం క్యాలెండర్‌ను సైతం సినారె సమక్షంలో ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో ఆవిష్కరించడం గమనార్హం.

చిత్రం.. సినారె తన 64 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్లలో 64 మంది కవులను సత్కరిస్తున్న దృశ్యం