రాష్ట్రీయం

గ్రామాన్ని మరువని సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడరూరల్, జూన్ 12: తాను ఎంత పెద్దస్థాయిలో ఉన్నా కన్నఊరు మాత్రం మరువలేదు..సింగిరెడ్డి నారాయణరెడ్డి. అంచలంచెలుగా ఎదిగి ..హైదరాబాద్‌లో స్థిరపడిన ..గ్రామ ప్రజలపై మమకారం మాత్రం మార్చిపోలేదు. తన స్వంత ఇంటిని గ్రామానికి ధారాదత్తం చేశారు. ఇంటిని గ్రంథాలయంగా మార్చి అప్పటి సర్పంచ్ తీగల రవీందర్‌గౌడ్‌కు అప్పగించారు రెండు వ్యానుల పుస్తకాలను గ్రామ గ్రంథాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచారు. ప్రతీ సంవత్సరం జనవరి 10తేదీన ఎక్కడ ఉన్నా ఆరోజు మాత్రం హన్మాజీపేటకు చేరుకొని అక్కడే తనతల్లిదండ్రులు, భార్య సమాధులను సందర్శించి స్మార్థం పెట్ట్టేవారు. గ్రామంలోని ప్రతీ ఒక్కరిని గుర్తు చేస్తూ వారి యోగక్షేమాలను ఆరా తీసేవారు. సినారె రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో హన్మాజీపేట గ్రామంలో సీసీ రోడ్లు, బోర్లు, అదనపు తరగత గదులు, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణాలు చేపట్టారు. అంతేకాకుండా హన్మాజీపేట -లింగంపల్లి గ్రామాలకు మధ్య రూ. 3 కోట్లతో బ్రిడ్జినిర్మాణం చేయించారు. ఈ వారధితో గ్రామాల మధ్య రాకపోకలు సులువు అయి రవాణా వ్యవస్థ మెరుగుపడింది. ప్రతీ గ్రామంలో కమ్యూనిటీ హాళ్ల్లు నిర్మించారు. బోర్లను వేసి నీటి ఎద్దడిని నివారించేదుకు కృషి చేశారు.
పట్టణంలో సినారె కళామందిరం
వేములవాడ పట్టణంలో ఎంపి కోటా ద్వారా రూ.48 లక్షలతో కళాకారుల కోసం కళామందిరాన్ని నిర్మించారు. పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులను మంజూరి చేశారు.
చందుర్తి మండలానికి 22 బోర్లు
చందుర్తి మండలంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న సమయంలో అప్పటి జడ్పీటీసీ సభ్యునిగా ఉన్న ఆదిశ్రీనివాస్ ప్రతీ గ్రామంలో ఒక్కో బోరు వేయాలని సూచించగా వెంటనే ఒప్పుకుని 22 బోర్లను వేయించి ప్రజల నోట్లో నాలుకయ్యారు. సినారె మరణంతో ఈ ప్రాంత ప్రజలు తమకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

చిత్రం.. కాలినడకతో గ్రామాన్ని సందర్శిస్తున్న సినారె