రాష్ట్రీయం

తెలుగు భాషకు తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: సినారె కన్నుమూశారన్న వార్తకు ప్రనుఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.. సినారె పార్థివదేహానికి మాజీ గవర్నర్ కె రోశయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేంద్ర, ప్రస్తుత ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ, ఎంపి తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి, తెలుగు యూనివర్శిటీ విసి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, తెలుగు అకాడమి మాజీ సంచాలకుడు ప్రొఫెసర్ కె యాదగిరి, సినీనటులు బ్రహ్మానందం, కృష్ణం రాజు, చిరంజీవి, టిడిపి ఇరు రాష్ట్రాల నాయకులు, బిజెపి నాయకులతో పాటు అనేక మంది ప్రముఖులు సంతాపం తెలిపారు.
తెలుగు సాహిత్య లోకం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. సాహిత్య రంగానికి సినారె రారాజు లాంటి వారు, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నా
- ఎం వెంకయ్యనాయుడు
మహాకవి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు సాహిత్య రంగంలో ఒక మహా ధృవతార నేలరాలింది. సినారె మరణం తెలుగు జాతికి తీరని లోటు, సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారు, మృధుభాషి, మానవతా వాది, ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివి.
-వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి
మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయన మృతి తీరని లోటు: వెంకటేష్
తెలుగు సాహితీ వనం వటవృక్షం, ఆయన గురుతుల్యులు: టిఎస్సార్
అన్ని రంగాల్లో సినారె దిట్ట: కోట శ్రీనివాసరావు
బహుముఖా ప్రజ్ఞాశీలి సినారె: నందమూరి బాలకృష్ణ(పోర్చుగల్ నుండి)
తెలుగు జాతికి తీరని లోటు : స్పీకర్ కోడెల శివప్రసాదరావు
తెలుగు జాతి గర్వించదగ్గ ధృవతార: నారా లోకేష్
ఆయన సేవలు అనన్యసామాన్యం : ఉప ముఖ్యమంత్రి చిన్న రాజప్ప
సినీరంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం : మంత్రి మాణిక్యాల రావు
సినారె మరణం తీవ్రంగా వెలితిని కలిగిస్తోంది: మాజీ గవర్నర్ కె రోశయ్య
సినారె ప్రభావం వేల మందిలో ఉంది, అందులో నేనొకడిని: సుద్దాల
తెలుగు భాషకు సుగంధం తెచ్చారు: ప్రొఫెసర్ యాదగిరి
సినిమా పాటకు గౌరవాన్ని ఇనుమడింపచేశారు : మంత్రి గంటా
కార్మికరంగాన్ని కూడా సినారె స్పృశించారు, కార్మికులపై రాసిన పాట వింటే కన్నీరు వస్తుంది: మంత్రి బండారు దత్తాత్రేయ
తెలుగు జాతికి మరో జ్ఞాన్‌పీఠ్ పురస్కారం అందించారు: లక్ష్మణ్
ఎంత చెప్పినా సినారెవి తరగని విజయాలు: పి మురళీధరరావు
అనేక పదవులు, పురస్కారాలు పొందిన వ్యక్తి : జి కిషన్‌రెడ్డి
సాంస్కృతిక మండలికి చేసిన సేవలు చిరస్మరణీయం: మంత్రి కడియం
విజయవాడ: సినారె అకాల మరణం పట్ల శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, రాష్ట్ర తెలుగు భాషా సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యనారాయణ, పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగు కవిత్వాన్ని తనదైన శైలిలో జాతీయస్థాయికి తీసుకెళ్లన ప్రఖ్యాత కవి యని అన్నారు.
న్యూఢిల్లీ : సినారె గొప్ప కవిగా, విమర్శకుడిగా ఎంపీ కెవిపి రామచందర్‌రావుపేర్కొన్నారు. ఆచార్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు సమాజానికి ఆయనెంతో సేవ చేశారని అన్నారు. సినారె ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని ఎంపీ ఎమ్‌ఏ ఖాన్ తెలిపారు.

చిత్రం.. సినారె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న వైకాపా అధినేత వైఎస్ జగన్