రాష్ట్రీయం

చిరస్మరణీయంగా సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, దివంగత ప్రముఖ కవి డాక్టర్ సి నారాయణరెడ్డి స్మారకార్థం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఆయన పేరిట సమావేశ మందిరం నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అలాగే ట్యాంక్ బండ్, కరీంనగర్ పట్టణం, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సినారె పేరు చిరస్థాయిగా నిలిచేందుకు ఓ ప్రముఖ సంస్థకు ఆయన పేరు పెడుతామన్నారు. మంగళవారం మధ్యాహ్నం సినారె ఇంటికి ముఖ్యమంత్రి వెళ్లి ఆయన పార్థివదేహానికి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ రాష్ట్రం గర్వంగా తల ఎత్తుకుని మా బిడ్డ అని చెప్పుకునేంతటి మహానీయుడు సి నారాయణరెడ్డి’ అని కొనియాడారు. సాహితీ రంగంలో చాలా గొప్ప కీర్తి శిఖరాలను అధిరోహించిన విశిష్టమైన సాహితీవేత్త అని అన్నారు. కవులు, రచయితలకు కూడా గ్లామర్ ఉంటుందని సి నారాయణరెడ్డి నిరూపించారన్నారు. సినారె పుట్టింది తెలంగాణ గడ్డమీద అయినా తెలుగు ప్రజలంతా గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగారన్నారు. ఆది, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో ఆయనకు ఆయనే సాటి, పోటీ అన్నారు. తెలంగాణ సాహితీ మకుటంలో కలికితురాయి అని, వారిని ఎంత కీర్తించినా తక్కువేనని అన్నారు. ఇటీవల బమ్మెర పోతన్న సమాధి వద్ద సినారె రచించిన మందారమకరందాల నుంచి తాను కొన్ని పద్యాలు ప్రస్తావించగా ఆ దృశ్యాలను సినారెగారు ఆసక్తిగా చూసారని వారి కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. సినారెకు తనలాంటి అభిమానులు కోటానుకోట్ల మంది ఉన్నారన్నారు.
సినారె అంత్యక్రియలకు వచ్చే ఆయన అభిమానుల కోసం అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేస్తున్నమన్నారు. అంత్యక్రియలలో తాను కూడా స్వయంగా పాల్గొంటానని, తెలంగాణ ప్రజల తరఫున సినారెకు గొప్ప వీడ్కోలు పలకాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
నేడు సారస్వత పరిషత్‌లో సినారె భౌతికకాయం
ప్రజల సందర్శనార్థం బుధవారం ఉదయం 9 గంటలకు బొగ్గుల కుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో సినారె పార్థివదేహాన్ని ఉంచుతారు. ఆ తర్వాత పది గంటలకు సారస్వత పరిషత్ నుంచి ప్రశాసన్ నగర్ తరలించి, అక్కడి నుంచి ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానం వరకు అంతిమ యాత్ర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి స్వయంగా అంతిమయాత్రలో పాల్గొంటారని అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

చిత్రం.. సినారె భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ తదితరులు