రాష్ట్రీయం

సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇళ్లపై ఏసిబి దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/అల్వాల్, జూన్ 13: హైదరాబాద్‌లోని మియాపూర్ భూకుంభకోణం కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కూకట్‌పల్లి సబ్ జిరిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. బోయిన్‌పల్లిలోని శ్రీనివాసరావు నివాసంలో అతని బంధువులు, బినామీ పేర్లపై ఉన్న పలు ఆస్తులకు సంబంధించి దస్తావేజులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పది చోట్ల జరిగిన ఈ దాడుల్లో ఇప్పటి వరకు మొత్తం రూ.14 కోట్లకు పైగా ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు, అతని కొడుకు కనిష్క పేరుతో 12 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు ఏసిబి డిఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. వీరికి 17 క్రెడిట్ కార్డులతోపాటు బినామీల పేరుతో ఉన్న పదహారు స్థలాల దస్తావేజులను స్వాధీన పర్చుకున్నట్టు డిఎస్పీ తెలిపారు.
కుటుంబ సభ్యులందరి పేరిట బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అతని కుమారుడు కనిష్క పేరుతో హాసిని పవర్ ప్రాజెక్ట్‌లో రూ.1.90 కోట్లు, నార్త్ స్టార్ హోమ్స్‌లో రూ.1.93 కోట్లు, మంజీరా హోల్డింగ్స్‌లో రూ.50 లక్షలు, ఐ-కాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.8.5 కోట్లు పెట్టుబడులు ఉన్నాయని ఏసీబీ డైరెక్టర్ పూర్ణచంద్రరావు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. అదేవిధంగా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల పేర్లపై రూ.1.27 కోట్లు విలువచేసే ఆరు ప్లాట్లు, మూసాపేట్, నర్సాపూర్ (మెదక్)లలో రూ.11.52 కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమి ఉన్నట్టు ఏసీబీ డైరెక్టర్ పేర్కొన్నారు. మరో పది చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని, దర్యాప్తు పూర్తయితే మరిన్ని అక్రమాలు బయటకు వస్తాయని ఆయన వివరించారు. ఇదిలావుండగా శ్రీనివాసరావు అక్రమాస్తులు దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటాయని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

చిత్రం.. మంగళవారం కూకట్‌పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు నిర్విహిస్తున్న ఏసిబి అధికారులు. స్వాధీనం చేసుకున్న దస్తావేజులు