రాష్ట్రీయం

కేకే డీల్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 14: వివాదాస్పద జాగీర్ భూముల కొనుగోలు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు అక్రమంగా కాజేశారని ప్రతిపక్షాలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన వివాదాస్పద భూముల కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు టిఆర్‌ఎస్ ముఖ్యనేత, ఎంపి కేశవరావు ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జాగీర్ భూముల క్రయ, విక్రయాలు చెల్లవని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రకటించిన 24గంటలలోనే తాము కొనుగోలు చేసిన భూముల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రకటించడం విశేషం. కోర్టు అనుమతితోనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం మండలం హఫీజ్‌పూర్‌లో తమ కుటుంబ సభ్యులు భూమి కొనుగోలు చేసినట్టు కేశవరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతోనే వీటిని కొనుగోలు చేసినప్పటికీ ఇవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్టు ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ భూముల కొనుగోలు కోసం చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని వీటిని విక్రయించిన విర్గో గ్లోబల్ మీడియా లిమిటెడ్ కంపెనీని కోరగా ఆ సంస్థ కూడా అంగీకరించిందని కేశవరావు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన భూ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్న విషయాన్ని కోర్టుకు తెలియజేస్తామన్నారు. అన్ని అనుమతులు ఉన్నాయనే తమ కుటుంబ సభ్యులు వీటిని కొనుగోలు చేశారు తప్ప మరొకటి కాదని ఆయన పేర్కొన్నారు. తమ సొంత ప్రభుత్వ నిర్ణయానికి, తమ నాయకుడి నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని కేశవరావు స్పష్టం చేశారు.