రాష్ట్రీయం

ఎస్‌ఐ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/సిద్దిపేట, జూన్ 14: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి సబ్-ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపింది. అధికారుల వేధింపులే ఈ విపరీత చర్యకు కారణమని ఒకవైపు వార్తలు వస్తుండగా, మరోవైపు ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన బ్యుటీషియన్ శిరీషతో ఎస్‌ఐకి సాన్నిహిత్యముందని ఈ ఘటనకు కారణం కావచ్చని మరో పార్శ్వం బయట పడటంతో కుకునూరుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కోపోద్రిక్తులైన స్థానికులు మీడియాపై విరుచుకుపడ్డారు. డిఎస్‌ఎన్జీ వ్యాన్‌ను దగ్ధం చేశారు. పరిస్థితిని అదుపుచేయటానికి పోలీసులు భద్రతను పెంచాల్సి వచ్చింది. పోలీస్ ఉన్నతాధికారుల వేధింపు కారణంగానే ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని కుటుంబీకులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ఇక్కడ ఎస్‌ఐగా పనిచేసిన రామకృష్ణారెడ్డి సైతం ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆగస్టు 17న పోలీస్‌క్వార్టర్స్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే పోలీస్ స్టేషన్‌లో పది నెలల వ్యవధిలోనే ఇద్దరు ఎస్‌ఐలు ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీస్ శివకుమార్, గజ్వేల్ ఏసిపి గిరిధర్ వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎస్‌ఐ ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. మీడియాలో రకరకాల కథనాలు వెలువడటంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఓ మీడియాకు చెందిన ఓబి వ్యాన్‌ను దగ్ధం చేశారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో కుకునూరుపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడని, దాన్ని పోలీసులు మాయం చేశారని ప్రచారం జరిగింది. దీంతో ఆందోళనకారులు ఎస్‌ఐ ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఘటనలో కొత్త ట్విస్ట్..
సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. హైదరాబాద్‌లో బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి వెనుక ఎస్‌ఐ ప్రభాకర్ పాత్ర ఉందనే అనుమాన కోణంలో విచారిస్తున్నట్టు పశ్చిమ మండల డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. శిరీష ఆమె స్నేహితులు రాజీవ్, శ్రవణ్‌లు ఆదివారం కుకునూరుపల్లికి వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ అందరూ కలసి విందు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా శిరీషతో ప్రభాకర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. అంతకుముందే శిరీషతో ఎస్‌ఐకు వివాహేతర ఉన్నట్టు తెలుస్తోంది. ఎస్‌ఐ అసభ్య ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన శిరీష హైదరాబాద్‌లో తాను పనిచేస్తున్న స్టూడియోలో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పోలీసులు గత రెండు రోజులుగా లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా తాను శిరీష పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం బయటకు వస్తుందనే భయంతో ఎస్‌ఐ తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఎస్‌ఐ ఆత్మహత్యపై విచారణకు డిజిపి ఆదేశం
ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలపై డిజిపి అనురాగ్ శర్మ తీవ్రంగా స్పందించారు. పోలీస్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అదనపు డీజీ గోపికృష్ణ, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్‌తో చర్చించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీజీ గోపికృష్ణ, ఐజీ స్టీఫెన్ రవీంద్రలను డీజీపి ఆనురాగ్‌శర్మ ఆదేశించారు.
సిద్దిపేట ఏసిపిపై వేటు..
ఈ ఘటనలో సిద్దిపేట ఏసిపి గిరిధర్‌పై వేటు పడింది. ఏసిపి గిరిధర్‌ను హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ డిజిపి అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.