రాష్ట్రీయం

మాకు జోన్ ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వే), జూన్ 15: ప్రతిష్ఠాత్మకమైన 10 రైల్వే ప్రాజెక్టులను ఒకేసారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించటం హర్షించదగ్గ విషయమని, వీలైనంత త్వరలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను కూడా ప్రకటించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబునాయుడు రైల్వే మంత్రి సురేష్ ప్రభును కోరారు. గురువారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, రైల్వే మంత్రి సురేష్ ప్రభు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజులతో కలిసి 10 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులు మంజూరు చేసిన రైల్వే మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ట్రిబ్యునల్ బెంచ్ ఏర్పాటుకు హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయన్నారు. మొదటి నుంచి విజయవాడ రైల్వే జంక్షన్ ఉందని,బ్రిటీష్ కాలం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే లైన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కృష్ణా, గోదావరి నదులపై రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా వర్ధిల్లిందని, భారతదేశానికే అన్నపూర్ణగా మారిందని, ఈ రైల్వే ప్రాజెక్టుల రాకతో అభివృద్ధికి బాటలు పడుతాయన్నారు.
రాష్ట్రంలో ప్రారంభించిన పలు రైల్వే ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వివరిస్తూ విజయవాడ నుంచి హౌరా వరకు (ట్రైన్ నెం.00890) హమ్ సఫర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ), తిరుపతి- జమ్ము తావి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (వీక్లీ), తిరుపతిలో బూట్ స్కీమ్ కింద యాంత్రిక లాండ్రీ, విజయవాడలో త్రీఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సిమ్యులేటర్, గుంతకల్లు-రాయచూరు-వాడి సెక్షన్‌ల మధ్య డబ్లింగ్, విద్యుదీకరణ పనులు ప్రారంభించారన్నారు. గుత్తి-్ధర్మవరం సెక్షన్ డబ్లింగ్ పనులను రూ.636.38 కోట్లతో 90 కిలోమీటర్ల మేర మంజూరు చేశారన్నారు.
కడప-పెండ్లిమర్రి కొత్త రైలు మార్గం 21.8 కిలోమీటర్ల మేర ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన సందర్భంగా కడప డెము ఎక్స్‌ప్రెస్ రైల్‌ను జూన్ 15(గురువారం)నుంచి నడపనున్నట్లు తెలిపారు. విశాఖ ఎలక్ట్రిక్ లోకోషెడ్ సామర్థ్యం 200 ఇంజన్లకు పెంచారన్నారు. విశాఖ రైల్వేస్టేషన్, ఎయిర్‌పోర్టుల్లో గ్రీనరీని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టడానికైనా భూమి కావాలని, ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడంతో ఈ ప్రాజెక్టులు రావడానికి అవకాశం ఏర్పడిందన్నారు. అమరావతి రాజధానితో రైల్వే కనెక్టివిటి పెంచాలని మంత్రిని కోరారు. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ మధ్య నిర్మించే రైల్వే లైన్ కనెక్టివిటీలో విశాఖను చేర్చాలని, అదే విధంగా ముంబై - ఖరగ్‌పూర్ మధ్య రైల్వే లైన్‌లో విశాఖకు కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని కోరారు. స్పీడ్ ట్రైన్స్ నిర్మాణంలో అమరావతి, బెంగళూరు, హైదరాబాద్‌కు అవకాశం కల్పించాలన్నారు. మచిలీపట్నం పోర్టు లింక్ ఆవశ్యకత గురించి వివరించారు. రాబోయే రోజుల్లో రైల్వేలకు అందించే కరెంట్ చార్జీలను కూడా తగ్గిస్తామని, ఇది రెండో తరం విద్యుత్ సంస్కరణల వల్ల సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు, హరిబాబు, పలువురు రాష్టమ్రంత్రులు, జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం పాల్గొన్నారు. రైల్వే ప్రాజెక్టుల ప్రారంభంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, రైల్వే ఉన్నతాధికారులు, వీడియో టెలీ లింక్ ద్వారా అందుబాటులోకి వచ్చి పాల్గొన్నారు.