రాష్ట్రీయం

క్రయవిక్రయాలు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: జాగీర్ భూముల అన్యాక్రాంతంపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. జాగీర్ భూముల క్రయ, విక్రయాలను రద్దు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్డినెన్స్‌ను శనివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టడానికి వీలుగా ఆర్డినెన్స్‌ను తక్షణం రూపొందించాల్సిందిగా రెవిన్యూ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు గురువారం ఆదేశించారు. ఈ ఆర్డినెన్స్‌ను శాసనసభ వర్షాకాల సమావేశంలో చట్టంగా మార్చాలని సిఎం నిర్ణయించారు. జాగీర్, ఇనాం, వక్ఫ్, దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా రీ-నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం జాగీర్ భూముల క్రయ, విక్రయాలపై నిషేధం కొనసాగుతోంది. కానీ, భూ కబ్జాదారులు చట్టాల్లోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో వీటిపై భూ హక్కులు సంపాదించారు. జాగీర్ భూములపై ఇప్పటివరకు జరిగిన క్రయవిక్రయాలను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఇక నుంచి వీటి రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా జాగీర్ భూములకు సంబంధించి సర్వే నంబర్లతో సహా అన్ని మండల రెవిన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిషేధించిన భూముల సర్వే నంబర్లను రిజిస్ట్రేషన్ రెవిన్యూ కార్యాలయాల వెబ్‌సైట్లలో పొందుపరచడం ద్వారా లావాదేవీలను నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆధీనంలోని ఎలాంటి రకం భూముల రిజిస్ట్రేషన్ అయినా రిజిస్ట్రేషన్ చేయటానికి ముందుగానే రెవిన్యూ అధికారులకు సమాచారం వెళ్లే విధంగా రిజిస్ట్రేషన్, రెవిన్యూశాఖలను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆదాయ, కుల, స్థానిక ధ్రువపత్రాల కోసం ‘మీ-సేవా’ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోగానే వాటి స్కానింగ్ పత్రాలు నేరుగా మండల రెవిన్యూ అధికారి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. జతపరిచిన పత్రాలు వాస్తవమైనవని మండల రెవిన్యూ అధికారి నిర్ధారించిన తర్వాతనే ఈ ధ్రువపత్రాలు జారీ అయ్యే విధానం ప్రస్తుతం కొనసాగుతుంది. ఇదే విధానాన్ని భూముల రిజిస్ట్రేషన్లలో కూడా అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూముల క్రయ, విక్రయాలపై రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగానే ఆ పత్రాలు మొదట సంబంధిత రెవిన్యూ అధికారి ధ్రువీకరణ కోసం పంపించాల్సి ఉంటుంది. రెవిన్యూ అధికారి ఆమోదం తెలిపితే తప్ప రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముందుకు వెళ్లకుండా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 200 రెవిన్యూ చట్టాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆంధ్ర ప్రాంతానికి, మరికొన్ని తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకంగా వర్తించేవి ఉన్నాయి. వీటిలో 60చట్టాలను తెలంగాణ రాష్ట్రానికి అనువైనవిగా గుర్తించి కొన్ని సవరణలతో ముసాయిదాలను తయారు చేయాల్సిందిగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం కోరింది. వీటిపై కసరత్తు దాదాపు పూర్తి అయింది. ఈ మేరకు నల్సార్ ప్రాథమికంగా రూపొందించిన ముసాయిదాలను న్యాయశాఖ పరిశీలిస్తోంది. ప్రభుత్వ ప్రమేయంతో కూడుకున్న జాగీర్, ఇనాం, వక్ఫ్, దేవాలయ, ధర్మాదాయ భూముల క్రయ విక్రయాలను నిషేధిస్తూ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. వర్షాకాల శాసనసభ సమావేశాలలో ఇది చట్టంగా మారనుంది.