రాష్ట్రీయం

మలుపుతిప్పే కోర్సులున్నా అభ్యర్థుల అనాసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: ఇంజనీరింగ్ కాలేజీల్లో 41 కోర్సులను ఆఫర్ చేస్తున్నా విద్యార్థుల దృష్టి మాత్రం ఒకటి రెండు కోర్సులపైనే ఉంది. మంచి కాలేజీ , మంచి కోర్సు ఎంపికకు ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు మలుపుతిప్పే అనేక కోర్సులకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ప్రచారం పొందిన కోర్సుల్లో చేరేందుకే మక్కువ చూపుతున్నారు. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫెసిలిటీస్ అండ్ సర్వీసు ప్లానింగ్, నావల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, ప్లానింగ్ , మైనింగ్ ఇంజనీరింగ్, మైనింగ్ మిషనరీ ఇంజనీరింగ్, బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, పవర్ ఇంజనీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నా విద్యార్థులు వాటి ముఖం చూడటం లేదు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్‌లపై దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో 32, ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో 210, ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో 42, బయోటెక్నాలజీలో 21, బయోమెడికల్‌లో 30, సివిల్ ఎన్విరాన్‌మెంటల్‌లో 60, కెమికల్ ఇంజనీరింగ్‌లో 246, సివిల్ ఇంజనీరింగ్‌లో 7788, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో 16668, డయిరీ-20, డిజిటల్ టెక్నిక్స్‌అండ్ డిజైన్ ప్లానింగ్‌లో 60, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 15322, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్-84, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో 8412, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ -238, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్-42, ఫుడ్ సైన్స్-43, ఫుడ్ ప్రాసెసింగ్ -20, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్-60, ఐటి-2487, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్-70, మెకెట్రానిక్స్-42, మెకానికల్‌లో 9872, మెటలర్జికల్-60, మైనింగ్-97, మెటలర్జి మెటీరియల్-42, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీ-60, ప్లానింగ్ -40, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 20 సీట్లు ఉన్నాయి. అయితే గత రెండు రోజులుగా అభ్యర్ధులు ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచిలకే ప్రాధాన్యత ఇచ్చారు.