రాష్ట్రీయం

12శాతంపై అదేమాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: ముస్లిం, మైనార్టీలకు విద్యా ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు పునరుద్ఘటించారు. మైనార్టీలకు రిజర్వేషన్లను పెంచే అంశాన్ని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో తాను భేటీ అయిన సందర్భంగా ప్రస్తావించినపుడు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని ఎల్బీ స్టేడియంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సిఎం హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముస్లింలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిపర్చడానికి తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధ కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. ముస్లింలకు ప్రస్తుతం కొనసాగిస్తున్న రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ శాసనసభలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించామన్నారు. మైనార్టీలను సామాజిక, ఆర్థికాభివృద్ధి కల్పించడం హక్కు అన్నారు. ఈ హక్కును సాధించడానికి ఎంతవరకైనా పోరాడుతామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని, ఈ నష్టాన్ని తెలంగాణ ఆవిర్భావం తర్వాత భర్తీ చేయడానికి తమ ప్రభుత్వం పూనుకుందన్నారు. ముస్లింలకు పాలనలోనూ భాగస్వామ్యం కల్పించడాన్ని ప్రాధాన్యతగా తీసుకున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవీతో పాటు హైదరాబాద్, వరంగల్ నగర డిప్యూటీ మేయర్లుగా ముస్లింలకే అవకాశం కల్పించామన్నారు. మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 204 గురుకుల విద్యాలయాలను తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా, సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం స్టడీ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. విదేశీ విద్యను అభ్యసించడానికి వెళ్లే ముస్లిం విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అందిస్తున్న మాదిరిగా రూ.20 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్‌లోనూ ప్రపంచస్థాయి గుర్తింపు పొందేలా ఇస్లామిక్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని, ఇప్పటికే దీనికోసం స్థలాన్ని కూడా
ఎంపిక చేశామన్నారు. మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలకే కాకుండా, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో ముస్లిం పెద్దలు, మేధావులు ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వవచ్చన్నారు. తనతో ఈ అంశంపై ఆసక్తి కలిగిన వారు ఎవరైనా మాట్లాడవచ్చాన్నారు. ఇఫ్తార్ విందుకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు ఎకె ఖాన్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

చిత్రం.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు వేదికపై మాట్లాడుతున్న సిఎం కెసిఆర్