రాష్ట్రీయం

నీటి భద్రతతోనే సుస్థిర వృద్ధి రేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 19: నీటి భద్రత కల్పిస్తే 90శాతం సమస్యలు పరిష్కారమవుతాని, వృద్ధిరేటులో సుస్థిరత సాధించగలుగుతామని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంపట్ల సిఎం సంతోషం వ్యక్తం చేశారు. రుతుపవనాలు అనుకూలంగా ఉన్నాయని, మధ్యలో ఎప్పుడన్నా డ్రై స్పెల్స్ వచ్చినా నీటికొరత రాకుండా చేసేందుకే ‘నీరు- ప్రగతి’ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. నీటి నిల్వ, వినియోగం, సంరక్షణలో నిర్వహణ సామర్థ్యం మరింతగా మెరుగుపడాలన్నారు. ఇప్పటివరకు 3.70 లక్షల పంట కుంటలు తవ్వారంటూ, ఇదే స్ఫూర్తితో మిగిలిన పంట కుంటల తవ్వకం పూర్తి చేయాలన్నారు. భూగర్భ జలాలు మే నెలకు, జూన్ నెలకు అర మీటరు పెరిగాయని, 14 అడుగుల నుంచి 12 అడుగులకు వృద్ధి చెందడం సానుకూల పరిణామమన్నారు. అన్ని శాఖల్లో క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు జవాబుదారీతనం పెరగాలని, సమన్వయ లోపాలు ఉండకూడదన్నారు. పంచాయితీరాజ్, గ్రామీణ నీటి సరఫరాకు జాతీయస్థాయిలో 19 అవార్డులు అందుకోవడం శుభ పరిణామమన్నారు. అత్యంత పారదర్శకంగా నరేగా నిధుల వినియోగంలో జాతీయస్థాయిలో రెండోసారి అవార్డు అందుకోవడం అందరికీ గర్వకారణమన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో సిఎస్ దినేష్‌కుమార్, పంచాయితీరాజ్ కమిషనర్ రామాంజనేయులు, ఉన్నతాధికారులు శశిభూషణ్, అనంతరాము, అజయ్‌జైన్, సంజయ్ గుప్తా, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.