రాష్ట్రీయం

డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లపై రెండు వారాలు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా సీట్ల ఖరారు ప్రక్రియపై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు రెండు వారాల పాటు స్టే విధించింది. డిగ్రీ కాలేజీల యజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ఈ స్టే విధించారు. కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది.
జస్టిస్ భగవతికి నివాళులు
రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు దివంగత జస్టిస్ భగవతికి ఘన నివాళులు అర్పించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్ , న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కొద్ది సేపు వౌనం పాటించారు.
అవుట్‌సోర్సింగ్ సిబ్బంది విలీనంపై పిటిషన్
ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని విలీనం చేయడంపై వరంగల్‌కు చెందిన ఎం శ్రవణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజావాజ్య పిటిషన్ హైకోర్టులో పరిశీలనకు వచ్చింది. త్వరలోనే దీనిపై న్యాయస్థానం ఒక నిర్ణయం తీసుకోనుంది.
అధికారుల తీరుపై ఆగ్రహం
కృష్ణా జిల్లాలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన 3.06 ఎకరాల భూమిని అసైన్డ్ భూమిగా పరిగణించి స్వాధీనం చేసుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. షేక్ అబ్దుల్ కలాం అజాద్ మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎం ఎస్ రామచంద్రరావు విచారణకు స్వీకరించారు. తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వం 25వేల రూపాయిలు ఖర్చులకు పిటిషనర్‌కు చెల్లించాలని ఆదేశించింది.
సర్వీసులు క్రమబద్ధం చేయండి
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న అటెండర్లు, స్వీపర్ల సర్వీసులను క్రమబద్ధం చేయాలని హైకోర్టు సోమవారం ఆదేశించింది. జస్టిస్ పివి సంజయ్ కుమార్, జస్టిస్ ఎన్ బాలయోగిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.