రాష్ట్రీయం

రహేజా కేసులో ఐఏఎస్‌లకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 20: రహేజా కేసులో ఎల్‌వి సుబ్రహ్మణ్యం, బిపి ఆచార్య, కె రత్నప్రభ సహా పలువురు ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. రహేజా మైండ్‌స్పేస్-ఎపి పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన కార్పొరేషన్ (ఏపిఐఐసి) జాయింట్ వెంచర్‌లో అక్రమాలకు పాల్పడినందుకు నిందితులైన ఐఏఎస్ అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని గతంలో ఎసిబి ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఏసిబి కోర్టు తమకు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ అప్పట్లో ఏపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ల పదవులు నిర్వహించిన ఐఏఎస్ అధికారులు ఎల్‌వి సుబ్రహ్మణ్యం, బిపి ఆచార్య, మరో ఐఏఎస్ కె రత్నప్రభ, ఐపిఎస్ అధికారి ఎం గోపీకృష్ణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌లోవివిధ పదవుల్లో పని చేసిన పిఎస్ ఆచార్య, రహేజా కార్పొరేషన్‌కు చెందిన రహేజా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్ బి శివశంకర రావు విచారణకు స్వీకరించారు.
జాయింట్ వెంచర్‌కు నగదు చెల్లించడానికి బదులు నానక్ రామ్ గూడలో ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇవ్వాలని ఈ ఐఏఎస్ అధికారులు కుట్రపూరిత ఆలోచన చేశారని, దీనివల్ల జాయింట్‌వెంచర్‌లో ఏపిఐఐసి వాటా 11 శాతంనుంచి 0.55 శాతానికి తగ్గిపోయిందని ఏసిబి తన చార్జిషీట్‌లో ఆరోపించింది. అయితే 2015 డిసెంబర్ 28న నేరశిక్షాస్మృతి (సిఆర్‌పిసి) సెక్షన్ 326 కింద ఇంతకు ముందే కొట్టివేసిన కేసును తనంతట తానే తిరిగి తెరిచే అధికారం ట్రయల్ కోర్టు జడ్జికి లేదని న్యాయమూర్తి శివశంకర్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 19 కింద ఐఏఎస్ అధికారులను విచారించడానికి కేంద్రం ప్రభుత్వంనుంచి ముందస్తు అనుమతులు తీసుకోవడం తప్పనిసరి అని జడ్జి అంటూ, పిటిషనర్లకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన దృష్ట్యా వీరిపై అభియోగాలు చెల్లవని కూడా జడ్జి స్పష్టం చేశారు. లంచం స్వీకరించేలా ఐఏఎస్ అధికారులను రహేజా సంస్థ ప్రలోభ పెట్టిందని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాధారాలను ఎసిబి సమర్పించలేకపోయిందని కూడా న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు.