రాష్ట్రీయం

దేవుడిపైనే భారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల/ షాబాద్ 24: రెండు రోజులు గడుస్తున్నా బోరుబావిలో పడిన చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో రెస్క్యూ బృందాల్లోనూ ఆందోళన కనిపిస్తోంది. రెండు రోజులుగా చేవెళ్ల మండల పరిధిలోని ఇక్కారెడ్డిగూడలో అధికార యంత్రాగం అన్ని శక్తులొడ్డి కృషి చేస్తున్నా ఎలాంటి ఫలితం కనిపించలేదు. చిన్నారి క్షేమంగా ఉండాలని దేవుడిపైనే భారం వేసి అధికార యంత్రాగం నిరంతరంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగించాలని మంత్రి మహేందర్‌రెడ్డి, ఆదేశించారు. శనివారం సాయంత్రం వరకూ నిరంతరంగా కృషి చేసినా చిన్నారిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో, పాప ప్రాణాలతో ఉందా? లేదా? అన్న అనుమానాలు అధికారులను ముసురుతున్నాయి. పాప ప్రాణాలకు భయం లేదని అధికారులు ధైర్యం చెబుతున్నా, చిన్నారి కుటుంబం, గ్రామస్తులు వేయి కళ్లతో సంఘటనా ప్రాంతం వద్దే ఎదురు చూస్తున్నారు. ఇదిలావుంటే, పాప మరింత లోతులోకి జారిపోయి ఉంటుందన్న అంచనాల
నేపథ్యంలో, చిన్నారిని రక్షించడం అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. అధికారులు ఒకపక్క సహాయక చర్యలు చేపడుతుంటే, 40 అడుగుల లోతులోవున్న చిన్నారి 215 అడుగల లోతుడు పడిపోయిందని అంచనా వేస్తున్నారు. దీంతో ఎయిర్‌లిఫ్ట్ ద్వారా బయటకు తీసేందుకు విశ్వప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బోరు యజమాని మల్లారెడ్డిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకూ చేపట్టిన సహాయక చర్యలకు భిన్నంగా నైపుణ్యంమున్న బృందాలు, అధినాతక సామగ్రితో ఆచూకీ కనుగొనేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమవుతున్నాయి. చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో ముంబయి నుంచి ప్రత్యేకంగా కొత్త టెక్నాలజీ కెమెరాలు తెప్పిస్తున్నట్టు చేవెళ్ల ఏంపీ కొండ విశే్వశ్వర్‌రెడ్డి వివరించారు. ఆ కెమెరాలు వస్తే, బోరువావిలో చిన్నారి ఎంత లోతులో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
తల్లితండ్రుల ఎదురుచూపు
రెండు రోజులుగా పాప కోసం ఏడుస్తూనే ఉన్న తల్లిదండ్రులు, ప్రాణాలతో బయటకు వస్తుందన్న ఆశతోనే ఉన్నారు. అధికారులు ఎన్ని రకాలుగా ధైర్యం చెబుతున్నా బోరుమని విలపిస్తున్న తల్లిదండ్రులు, చిన్నారిని క్షేమంగా బయటకు తీయాలని కనిపించిన వారందరినీ వేడుకుంటున్నారు.
ఇక్కారెడ్డిగూడలో జనసంద్రం
ఇక్కారెడ్డిగూడ గ్రామంలో గురువారం సాయంత్రం చిన్నారి బోరుబావిలో పడిన సంఘటన తెలిసినప్పటి నుంచి రెండు రోజులుగా జిల్లా నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీంతో ఇక్కారెడ్డిగూడ గ్రామం జనసంద్రమైంది. ఇదిలావుంటే, చిన్నారి క్షేమంగా బయటకు రావాలని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పిల్లలు, పెద్దలు పూజలు చేస్తుండటం గమనార్హం.

చిత్రం.. నిరంతరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. (ఇన్‌సెట్‌లో) చిన్నారి కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు