రాష్ట్రీయం

చిన్నారి మీనా కథ విషాదాంతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: బోరుబావిలో పడిన చిన్నారి మీనా కథ విషాదంగానే ముగిసింది. జిల్లా అధికార యంత్రాంగం మూడు రోజులపాటు శ్రమించినా చిట్టితల్లి మీనాను కాపాడలేకపోయారు. పాప మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చూడాల్సి రావడంతో తల్లిదండ్రులతోపాటు సంఘటన స్థలంలో పలువురు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. అసలేం జరిగిందంటే.. గురువారం సాయంత్రం తోటి చిన్నారులతో ఆడుకుంటున్న మీనా తెరచివున్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం అందుకున్న మంత్రి మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎలాగైనా పాపను బయటకు తీయాలని విశ్వప్రయత్నాలు సాగించారు.
రెస్క్యూ టీం ఆపరేషన్..
జూన్ 22న సాయంత్రం గం. 6:45లకు చిన్నారి మీనా బోరుబావిలో పడింది. వెంటనే స్థానికులకు సమాచారం. అదేరోజు రాత్రి గం. 7:15లకు బోరుబావి వద్దకు చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది. మరో ఐదు నిముషాల్లోనే మంత్రి మహేందర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. రాత్రి గం. 7:45లకు జేబిసిల రాక, రాత్రి గం. 11:00లకు సంఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది. రాత్రి గం. 11:30లకు ఘటనాస్థలానికి వచ్చి పనులు పరిశీలించిన కలెక్టర్ రఘునందన్, గురువారం అర్ధరాత్రి 12:00లకు అత్యాధునిక పరికరాలతో మంగళగిరి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం. జూన్ 23న బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ప్రారంభం. బోరుబావి నుంచి మోటార్ వెలికితీత. మధ్యాహ్నం వరకు మళ్లీ తవ్వకాలు. పాప 40 అడుగుల నుంచి 100 అడుగుల లోతుకు. జూన్ 24న ఉదయం ప్రత్యేక లేజర్ కెమెరాలతో పాపను గుర్తించే పనిలో సిబ్బంది. 110 అడుగుల లోతు వరకు కెమెరాలను పంపించినా కనిపించని పాప ఆనవాళ్లు. మధ్యాహ్నం అత్యాధునిక మ్యాట్రిక్‌స వాటర్ ప్రూఫ్ కెమెరాతో 210 అడుగుల లోతు వరకు అనే్వషణ. సాయంత్రం కొక్కెం లాంటి పరికరాలతో పాపను బయటకు తీసే యత్నం. జూన్ 24న అర్ధరాత్రి దాటిన తరువాత పాప చనిపోయి ఉండొచ్చని అనుమానాలు, ఆదివారం వేకుజాములో కేఎల్‌ఆర్ ఇండస్ట్రీ నుంచి ప్రత్యేక యంత్రాలు రాక. బోరుబావిలోకి ఫ్లషర్ పెట్టి చిన్నారి దేహాన్ని బయటకు తీసే యత్నం. దాదాపు ఆరుగంటల తరువాత బోరుబావి నుంచి దుర్వాసన, అనంతరం పాప అవశేషాలు, దుస్తులు వెలికితీత. చిన్నారి మృతి చెందినట్టు ఉదయం. 6:35లకు మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటన. అనంతరం పాప అవశేషాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ఏరియా ఆసుపత్రికి తరలింపు. అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగింత. ఆదివారం సాయంత్రం చిన్నారి అంత్యక్రియలు.