రాష్ట్రీయం

ఉగ్రవాది ఒమర్‌పై కొనసాగుతున్న విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సానుభూతిపరుడు కొనకళ్ల సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీ (సిట్) అధికారులు ఈనెల 23న సాయంత్రం టోలిచౌక్‌లోని పారావౌంట్ కాలనీలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్ల క్రితం వరకు సుబ్రహ్మణ్యంగా ఉన్న ఒమర్ గుజరాత్ వెళ్లిన తరువాత మత ఛాందసవాదిగా మారాడు. ఇంటర్నెట్ సహాయంతో ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తికి పూనుకున్నాడు. ఒమర్ రోజుకు 12 గంటలపాటు ఆయన ఇంటర్నెట్‌లోనే ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు యత్నించేవాడని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద భావజాలంను యువతకు ఒంటిపట్టించడంలో దిట్టగా ఒమర్‌కు పేరుంది. యువతను ఆకర్షింపజేయడంలో వాగ్థాటి, యువకులను శిక్షణకు పంపడంతోనే ఏ ప్రాంతాలను విధ్వంసం చేయాలని టార్గెట్ ముందుగానే చెప్పేవాడని తెలిసింది. తన ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడినట్లు విచారణలో ఒమర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఒమర్ ఉగ్రవాద సంస్థలో ఎందుకు చేరాడు? హైదరాబాద్‌నే టార్గెట్‌గా కార్యకలాపాలకు ఎందుకు పాల్పడాలనుకున్నాడు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూసినట్టు తెలిసింది.
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం 2014లో హైదరాబాద్‌లో ఇస్లాం మతాన్ని స్వీకరించాడు. సిరియాకు చెందిన ఓ కమాండెంట్ ఆదేశంతోనే మతం మార్చుకున్నట్టు చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మతమార్పిడి అనంతరం తీవ్రవాదం వైపు ఆకర్షితుడైన ఒమర్ గుజరాత్‌లో ఐసిస్ కార్యకలాపాలపై శిక్షణ తీసుకున్నాడు. సామాజిక మాధ్యమాల ద్వారానే ఐసిస్ వ్యాప్తికి దోహదపడేవాడని తెలుస్తోంది. ఒమర్‌ను విచారిస్తున్న పోలీసులకు అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒమర్‌తోపాటు ఇంకా ఎవరున్నారు. హైదరాబాద్‌లో ఎంత మందిని రిక్రూట్ చేశాడు. అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుందని సిట్ అధికారులు పేర్కొన్నారు.