రాష్ట్రీయం

‘వకీల్’ కావాల్సినవాడ్ని.మంత్రినయ్యా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ‘వకీల్’ కావాల్సినవాడ్ని, ఇందిరా గాంధీ పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చి, ఇక్కడ ఇలా ఉన్నానని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ‘ఎమర్జెన్సీ-చీకటి రోజులు’ అనే అంశంపై బిజెపి రాష్ట్ర శాఖ ఆదివారం నిర్వహించిన సభకు వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వారికి ఆయన ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం వెంకయ్య నాయుడు ప్రసంగిస్తూ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఎమర్జెన్సీ విధించారని తెలిపారు. ఆ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్న తాము అజ్ఞాతంలోకి వెళ్ళినా, వ్యతిరేక పోరాటాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి విశాఖ జైలులో పెట్టారని అన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారని చెప్పారు. జైలులో కూడా చురుగ్గా ఉండడంతో 1977లో జరిగిన ఎన్నికల్లో తనను ఒంగోలు నుంచి జనతా పార్టీ నుంచి తరఫున పోటీ చేయాల్సిందిగా వత్తిడి రావడంతో పోటీ చేశానని, ఇందిరా గాంధీ పుణ్యమా అని వకీల్ కావాల్సిన తాను ఇలా అయ్యానని చెప్పడంతో అందరూ నవ్వారు.
వెంకయ్యకు తెలంగాణ ఉపాధ్యాయుల సన్మానం
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ను ఆమోదింపజేయడంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆదివారం ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్టప్రతి ఆమోదం లభించిందని అన్నారు.

చిత్రం.. ఎమర్జెన్సీ కాలాన్ని ‘చీకటి రోజులు’గా పేర్కొంటూ ఆదివారం హైదరాబాద్‌లో బిజెపి నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు