రాష్ట్రీయం

తిరుమలలో తప్పిపోయిన తెలంగాణ మాజీ ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 25: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా బూర్గంపాడుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం (63) ఆదివారం తిరుమలలో తప్పిపోయారు. ఈ మేరకు ఆయన సతీమణి వెంకటరమణ తిరుమల వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం పెద్దల్లుడు డాక్టర్ సంతోష్‌కుమార్ కథనం మేరకు- తన మామ కుంజా భిక్షం రెండేళ్లుగా మతిమరుపుతో బాధపడుతున్నారన్నారు. ఈ నెల 23న తన కొడుకు పుట్టువెంట్రుకలు తీయడానికి 16 మందితో కలసి తిరుమలకు వచ్చామన్నారు. ఆదివారం స్వామివారి మొక్కులు తీర్చుకుని రూ.300 క్యూలైన్‌లో ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చామని ఆ సమయంలో తన మామ వెంటే ఉన్నాడన్నారు. అటు తరువాత ఆయన కనపడకపోవడంతో పరిసర ప్రాంతాల్లో గాలించామన్నారు. వన్‌టౌన్ పోలీసుల సహకారంతో సిసిటివి ఫుటేజ్‌ను పరిశీలిస్తే అన్నప్రసాద భవనం వద్ద అటు తరువాత రాంభగీచా బస్టాండ్ వద్ద వెళుతున్న దృశ్యాలను గమనించామన్నారు. అంతేకాకుండా నారాయణగిరి మార్గంలో తన మామను పోలిన వ్యక్తి వెళుతున్న దృశ్యం చూసి పోలీసులతో పాటు వెళ్ళి గాలించామన్నారు. అయినప్పటికీ ఫలితం లేదన్నారు. ఎవరైనా గుర్తించిన వారు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇదిలావుండగా మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షంకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రవీణను డాక్టర్ సంతోష్‌కుమార్‌కి ఇచ్చి వివాహం చేశారు. మరో కుమార్తె పేరు శ్రీవాణి. ఈ మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.