రాష్ట్రీయం

వ్యాయామ విద్య కొత్త పుంతలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ఫిజికల్ లిటరసీ పేరుతో వ్యాయామ విద్యను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పుంతలు తొక్కించనుంది. క్రీడలుసహా యోగా, సంగీతం, నృత్యం వంటి అంశాలను జోడించడంద్వారా మరింతమంది విద్యార్థులకు వ్యాయామాన్ని చేరువ చేయనుంది. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, పెరుగుదల, ఆనందం, జీవితకాలంపై వ్యాయామ విద్య ప్రభావం చూపుతుంది. తమ జీవితకాలంలో ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు, నైపుణ్యాల పెంపునకు వ్యాయామ విద్య కీలక పాత్ర వహిస్తుంది. దీన్ని దృష్టిలో పాఠశాలల్లో వ్యాయామ విద్య ప్రారంభించేందుకు ఒక మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంఘం సిఫారసుల మేరకు వ్యాయామ విద్యను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటివరకూ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీగా ఉన్న వ్యాయామాన్ని పాఠశాల విద్యలో అంతర్భాగం చేశారు. విద్యార్థి బహుముఖ వికాసానికి ఇది ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. జీవన విధానంలో సమతుల్యత, వ్యాయమం, నిద్ర, పౌష్టికాహారం వంటివి వ్యాయామ విద్యలో సమ్మిళతం కానున్నాయి. ఇప్పటివరకూ వ్యాయమ విద్య అంటే పాఠశాలల్లో కేవలం క్రీడల నిర్వహణకే పరిమితమవడం తెలిసిందే. కానీ వ్యాయామ విద్యా విధానంలో యోగాను కూడా బోధించనున్నారు. యోగ నిద్ర, ప్రాణాయామం, మెడిటేషన్, తాయ్‌చి, సంగీతం, కదలికల్లో నైపుణ్యం పేరిట పరుగు, జంపింగ్, బ్యాలెన్సు, త్రోయింగ్, గ్లైడింగ్, స్ట్రైకింగ్ వంటివి నేర్పుతారు. కోలాటం, డప్పు, కర్రసాము, ఏరోబిక్ తరగతులు, ట్రెక్కింగ్, పర్యతారోహణ, వాటర్ సర్ఫింగ్, రాఫ్టింగ్, డైవింగ్ వంటి అంశాల్లోనూ ప్రవేశం కల్పిస్తారు. క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ వంటి పోటీల నిర్వహణ వంటివి కూడా ఇందులో భాగం కానున్నాయి. గ్రామాల్లో ఒకప్పుడు కనిపించిన తొక్కుడుబిళ్ల, బిల్లంగోడు, ఏడురాళ్ల ఆట, ఖోఖో, కబడ్డీతో పాటు కూచిపూడి, భరతనాట్యం, కలరిపట్టు, వెస్టర్న్ డ్యాన్సులను కూడా వ్యాయామ విద్యలో భాగం చేశారు. దీంతో గతంలో ఉన్న వ్యాయమ విద్యకు భిన్నంగా ప్రభుత్వం రూపొందించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నారు. వారంలో ఆరు రోజులు ఫిజికల్ లిటరసీ తరగతులు నిర్వహిస్తారు. రోజులో చివరి గంటను ఇందుకు కేటాయించేందుకు నిర్ణయించారు. ఎంపిక చేసిన పిఇటిలను మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇవ్వనున్నారు. ఫిజికల్ లిటరసీ విధానం ఒకటి నుంచి పదో తరగతి వరకూ అమలు చేసేందుకు వీలుగా కరిక్యులం కూడా అభివృద్ధి చేయనుంది. ఇందుకు అవసరమై క్రీడా మైదానాలను అభివృద్ధి, మైదానాలు లేని పాఠశాలలు ఇతర సంస్థలతో ఒప్పందం వంటి చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అమలుచేసేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్యమే మహాభాగ్యమని, చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగా ఉండటం, శారీరక పటుత్వం ప్రాధాన్యత తెలియచేసేలా విద్యార్థులను తీర్చిదిద్దటంపై ప్రభుత్వం దృష్టి సారించింది.