రాష్ట్రీయం

సమర్థతకు గీటురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 11: ‘సిఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. నా సమర్థత, రాష్ట్రంలోవున్న అవకాశాలు చూసి అనేకమంది పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. జన్మభూమిపై వారికున్న అభిమానాన్ని పెట్టుబడుల రూపంలో చాటుతున్నారు’ అని సిఎం చంద్రబాబు అన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు రెండోరోజైన సోమవారం 245 ఎంఓయులు జరిగాయి. ఎంఓయులను సిఎం చంద్రబాబు ఆయా కంపెనీల యాజమాన్యాలకు అందించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్దఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి రావడం శుభసూచికమన్నారు. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త తయారుకావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాష్ట్రంలో చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఇ) ప్రోత్సహించనున్నట్టు చెప్పారు. జిడిపిలో 37శాతం ఎంఎస్‌ఎంఇల భాగస్వామ్యం ఉందన్నారు. అందుకే వారికి పెద్దఎత్తున రాయితీలిచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. చిన్న, మధ్య తరహా, కుటీర పరిశ్రమలు ఎక్కడైనా దెబ్బతింటే, వాటిని ఆదుకునేందుకు 100 కోట్లతో నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్నతరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సిఐఐ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తోందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెద్దఎత్తున కారిడార్లను అభివృద్ధి చేయబోతున్నామని చంద్రబాబు చెప్పారు. నెల్లూరు, చిత్తూరు, చెన్నై కారిడార్‌ను ట్రై ఇండస్ట్రియల్ జంక్షన్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నం- శ్రీకాకుళాన్ని ఒక క్లస్టర్‌గా, కాకినాడ- నర్సాపురాన్ని, అమరావతి- మచిలీపట్నం- వాడరేవును, కర్నూల్- అనంతపురం- బెంగళూరును ఒక కారిడార్‌గా తీర్చిదిద్దనున్నామని ఆయన పేర్కొన్నారు.