తెలంగాణ

రైల్వే లైన్ల విద్యుదీకరణతో కాలుష్య రహిత నెట్ వర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: రైల్వే లైన్ల విద్యుదీకరణ వల్ల కాలుష్య రహిత రైల్వే నెట్‌వర్క్ ఏర్పడుతుందని రైల్వే బోర్డు ట్రాక్షన్ సభ్యుడు ఘన్‌శ్యామ్ సింగ్ అన్నారు. అంతేకాకుండా రైళ్లు సకాలంలో నడిచేందుకు వీలు ఉంటుందని చెప్పారు. గురువారం ఘన్‌శ్యామ్ సింగ్ దక్షిణ మధ్య రైల్వేను సందర్శించారు. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్ ఘన్‌శ్యామ్ సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ద.మ. గుంతకల్లు-వాడి, సికింద్రాబాద్-వాడి మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ రైల్వే లైన్‌లో మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ల నడుస్తున్న తీరును కూడా చర్చించారు. లైన్ల విద్యుదీకరణ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి డీజిల్ వినియోగం తగ్గుతుందని, దీని వల్ల డీజిల్‌పై చెల్లించే విదేశీ నగదు భారం తగ్గి రైల్వేకు కలిసి వస్తుందని బోర్డు సభ్యుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైళ్లు సకాలంలో నడిపేందుకు వీలు ఉండడంతో పాటు హై పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ అందుబాటులోకి వచ్చి, అదనపు కోచ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.