రాష్ట్రీయం

కోర్టు ధిక్కారం కేసులో ముగ్గురు ఐఎఎస్‌లకు హైకోర్టు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: కోర్టు ధిక్కారం కేసు కింద ఆంధ్రాకు చెందిన ముగ్గురు ఐఎఎస్ అధికారులు నీలం సహాని, కె సునీత, ఎం ప్రసాదరావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేశారు. గుంటరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీకి చెందిన లెక్చెరర్ డాక్టర్ దర్శి ఫీబే సారహ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తనను బాటనీ లెక్చెరర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పోస్టులో నియమించాలని కోరుతూ లెక్చెరర్ హైకోర్టును 2003లో ఆశ్రయించారు. ఈ కేసును పరిగణనలోకి తీసుకుని లెక్చెరర్‌కు న్యాయం చేయాలని 2013లోనే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఇంతవరకు కాలేజి విద్య రీజనల్ డైరక్టెర్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు కోర్టు ధిక్కారం కింద నోటీసులను ముగ్గురు అధికారులకు జారీ చేసింది.