ఆంధ్రప్రదేశ్‌

నేనెవరికీ వివరణ ఇవ్వలేదు: పూరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై దర్శకుడు పూరి జగన్నాథ్ నోరు విప్పారు. ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఆయనదే కావడం విశేషం. తన ట్విట్టర్ ఖాతా ద్వారా శనివారం ఆయన తన స్పందన తెలియజేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై తాను ఇంతవరకూ ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వలేదని, ఎటువంటి వ్యాఖ్యలు, ప్రకటనలు చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘పైసా వసూల్’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నానంటూ పేర్కొన్నారు. పూరీజగన్నాధ్ పేరుతో సిట్‌కు ఓ లేఖ వచ్చిందని, అందులో పలువురి పేర్లు ఉన్నాయంటూ ఓ వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేసింది. అయితే సదరు లెటర్‌కు ఆ పేర్లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, త్వరలోనే నిజానిజాలు బయటపడతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, సిట్ అనేకమంది నటీనటులకు, దర్శకులకు తాఖీదులు పంపించిన నేపథ్యంలో పలువురు అధికారులముందు హాజరై తమ వాదనలు విన్పిస్తున్నారు. కొందరి పేర్లు అనవసరంగా మీడియా ప్రచారం చేస్తోందని, తమకు నోటీసులు అందలేదని మరికొందరు వాదిస్తుండడం విశేషం.
తప్పుకు శిక్ష తప్పదు: తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్
తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాదకద్రవ్యాలు వాడుతున్నట్లు వార్తలు రావడం బాధాకరమని, పదిమందికి నోటీసులు వచ్చినంత మాత్రాన మొత్తం సినిమా పరిశ్రమనే తప్పుపట్టడం సమంజసంకాదని ఆయన అన్నారు. కొంతమంది పెద్ద నిర్మాతల పిల్లలకు బదులుగా వేరే వాళ్ల పేర్లను సూచించారని, అది కరెక్టు కాదని, తప్పుచేసిన వారెవరైనా తప్పించుకోలేరని, ఎంతటి వారికైనా శిక్ష తప్పదని వారు అన్నారు. తప్పు చేయనివారికి తెలంగాణ ఫిలిం చాంబర్ తరపున సహకారం ఎప్పుడూ ఉంటుందని, నోటీసులు అందుకున్నంత మాత్రాన ముద్దాయిలు కారన్నారు. డ్రగ్స్ మహమ్మారిని పబ్బుల్లోనే సప్లై చేస్తున్నారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత తెలిపారు.