రాష్ట్రీయం

12 మంది ఐఎఎస్‌ల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: రాష్ట్రంలో 12 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ, భూసేకరణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మన్మోహన్ సింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జెఎస్‌వి ప్రసాద్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా కె ప్రవీణ్‌కుమార్, బిసి సంక్షేమ శాఖ కార్యదర్శిగా బి ఉదయలక్ష్మిని నియమిస్తూ ఇంటర్ విద్యాబోర్డు కమిషనర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె సునీత, పురావస్తు శాఖ కమిషనర్‌గా వాణీమోహన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్‌రెడ్డి, ప్రణాళికా శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనూప్ సింగ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఆర్‌ఏఎస్ అధికారి కెవివి సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఎఫ్‌ఎస్ అధికారి ఎస్ శ్రీ్ధర్, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌గా షణ్మోహన్‌ను నియమించారు.