రాష్ట్రీయం

బొల్లినేనికి ఉద్వాసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై తెలుగుదేశం పార్టీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మహారాష్టల్రోని విదర్భ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన కాలువ నిర్మాణాలు, మరమ్మతులు, ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులు చేసిన రామారావుకు చెందిన కంపెనీ పలు అవకతవకలకు పాల్పడినట్లు మహారాష్ట్ర ఎసిబి గుర్తించింది. ఆమేరకు ఆయనపై నాగపూర్ ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి నిందితుడిగా చేర్చారు. అంచనాకు మించిన ప్రతిపాదనలతో కోట్ల రూపాయలు స్వాహా చేశారంటూ మిగిలిన నిందితులపైనా ఎసిబి అభియోగాలు నమోదు చేసింది. కాగా ఏపితో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటకలోని రామారావు ఆస్తుల పైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది మీడియాలో హల్‌చల్ చేయడం పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటువేసి, విచారణలో నిర్దోషిగా నిరూపణ అయితే తిరిగి తీసుకోవడం ద్వారా పార్టీ ఇమేజ్‌ను కాపాడుకోవాలని నాయకత్వం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. కాగా ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో ప్రతిపక్షాల నోటికి తాళం పడినట్టయింది. అవినీతికి పాల్పడేవారు ఎవరైనా ఉపేక్షించబోమని అటు ప్రజలకూ సంకేతాలివ్వడంతో పార్టీ ఇమేజ్ పెరిగినందున, బొల్లినేని విషయంలో కూడా అదే విధానం పాటించాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఇదిలావుండగా అవినీతితో తనకు సంబంధం లేదని, తానెలాంటి అవకతవకలకు పాల్పడలేదని ఎమ్మెల్యే రామారావు వాదిస్తున్నారు. అటు టిడిపి నేతలు కూడా ఇది మహారాష్టల్రో గత కాంగ్రెస్, ఇప్పటి బిజెపి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఎత్తుగడ యుద్ధంలో భాగమేనని విశే్లషిస్తున్నారు.