రాష్ట్రీయం

ఎవరినీ వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ‘రాష్ట్రంలో కల్తీలు, నకిలీలు, మాదక ద్రవ్యాల వంటి దందాలకు తావులేదు. వీటితో సంబంధం ఉంటే ఎంతటి వారైనా వదిలిపెట్టవద్దు. టిఆర్‌ఎస్ వారైనా, రాజకీయ నాయకులైనా, చివరికి కేబినెట్ మంత్రి ఉన్నా వదిలిపెట్టవద్దు, కేసులు పెట్టి జైలుకు పంపాల్సిందే’ అని పోలీస్, ఎక్సైజు, నిఘా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశం చేశా రు. ‘ప్రభుత్వానికి ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదు, అక్రమార్కుల ఆటకట్టించే విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ, అధికారం కల్పిస్తున్నాం’ అని అన్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ, లైఫ్ లైన్ దీని ఇమేజ్ కాపాడటం అత్యంత అవసరమన్నారు. డ్రగ్స్ కేసు పరిశోధనలో ఉన్న సమయంలో సెలవులో వెళ్లవద్దని ఎక్సైజు ఎభ్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌కు తానే సూచించానని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘ఈ కేసు పూర్వోపరాలన్నీ క్షణ్ణంగా వెలికి తీయండి, ఎవరినీ వదిలొద్దు, అందరినీ శిక్షించాలి, హైదరాబాద్‌లో డ్రగ్స్ దందా చేయలేం.వినియోగించలేమనేంతటి భయబ్రాంతులయ్యేలా చర్యలు ఉండాలి. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చండి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్రగ్స్, కల్తీలు, నకిలీల వంటి సామాజిక రుగ్మతలు అరికట్టడంపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతిభవన్‌లో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, డిజిపి అనురాగ శర్మ, హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి, ఎక్సైజుశాఖ మంత్రి పద్మారావు, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్, ఎక్సైజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్‌తో పాటు నగర పోలీస్ కమిషనర్లు, డిఐజిలతో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక గడిచిన మూడేళ్లలో అక్రమాలను అరికట్టే విషయంలో ఎక్కడా రాజీపడేలేదు. ఈ వేడి, ఈ వత్తిడి ఇక ముందు కూడా కొనసాగించండి, మీకు కావాల్సిన బలం, బలగం ఏదీ కావాలన్నా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తప్పు చేసే వారిని ఉక్కుపాదంతో అణచివేయండి కేసుల పరిశోధనలో తమ నుంచి ఎక్కడా రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. షీ టీమ్స్ ప్రయోగం విజయవంతం అయింది, 95 శాతం గుడుంబా మహమ్మారిని తరిమికొట్టగలిగాం, పేకాట జాడ్యాన్ని రూపుమాపగలిగాం, ఆన్ లైన్ పేకాటను కూడా నిషేధిద్దాం, ఈ విషయంలో కోర్టుకెళ్లారు, వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం కోర్టులకు కూడా వివరిస్తుందన్నారు. ఆహా పదార్థాల కల్తీ, నకిలీ విత్తనాలు, డ్రగ్స్ సరఫరా వ్యవస్థీకృత నేరాలు. తయారీ నుంచి అమ్మకాల వరకు చాలా మందికి ఇందులో భాగస్వామ్యం ఉంటుందన్నారు. అసాంఘిక శక్తులు, టెర్రరిస్టులు, తీవ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే వీటిపై కూడా నిరంతర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. ‘ప్రాణాలు కాపాడే రక్తంలో కూడా కల్తీ జరుగుతుందని ఇటీవల తెలిసి ఎంతో బాధపడ్డా, బతికిస్తారని నమ్మివచ్చిన వారిని చంపుతారా?, ఇలాంటి వారికి యావజ్జీవ కారాగారం పడే విధంగా కఠిన శిక్షలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలతో కఠిన శిక్షలు వేయడం సాధ్యం కాకపోతే కొత్త చట్టాలు రూపొందించుకుందాం, అని ముఖ్యమంత్రి అన్నారు. కల్తీలు, డ్రగ్స్, గంజాయి వంటి దుర్మార్గాలు కొనసాగడం వెనుక కొందరు అవినీతి అధికారుల సహకారం ఉంటుంది, రాష్టవ్య్రాప్తంగా అలాంటి వారి చిట్టా తయారు చేసి నిఘా పెట్టండని ముఖ్యమంత్రి ఆదేశించారు. జాబితా తయారు చేసే బాధ్యతను ఎసిబి డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్‌రావుకు అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. కల్తీలు, నకిలీలు, డ్రగ్స్, అవినీతి తదితర అంశాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలకు ప్రత్యేకంగా ఉన్నతాధికారుల నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.

చిత్రం.. ఆదివారం ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కెసిఆర్