రాష్ట్రీయం

శ్రీవారి ఆలయంలో నేత్రపర్వంగా ఆణివార ఆస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం సాలకట్ల ఆణివార ఆస్థానం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల నడుమ బంగారు వాకిలి ముందున్న గంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారు గరుత్మంతునికి అభిముఖంగా కొలువుదీరారు. మరోపీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనుల వారు, దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్‌కు ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీవారి ఆలయ పెద్దజియ్యంగార్ పెద్ద వెండితట్టలో 6 పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా విచ్చేసి వస్త్రాలను అర్చకులకు అందించారు. 4 పట్టువస్త్రాలను శ్రీవారి మూలవిరాట్‌కు అలంకరించిన అర్చకులు మరో 2 వస్త్రాలను మలయప్ప స్వామివారికి, మరొకటి విష్వక్సేనుల వారికి అలంకరించారు. అనంతరం శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు తమ తలకు శ్రీపాదవస్త్రంతో ‘పరివట్టం’ (చిన్నపట్టువస్త్రం) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు. అనంతరం అర్చకులు పెద్దజియ్యర్, చిన్నజియ్యర్‌లకు టిటిడి తరపున ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ‘లచ్చన్న’ అను తాళపుచెవి గుత్తిని వరుసక్రమంలో స్వామివారి కుడిచేతికి తగిలించారు. అనంతరం హారతి, చందనం, తాంబూళం, తీర్థం, శటారి మర్యాదలు చేసిన అనంతరం తాళపుచెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచారు. వార్షిక లెక్కలను ప్రారంభించడమే ఆణివార ఆస్థానం అని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలన స్వీకరించిన రోజున స్వామివారికి భక్తులు సమర్పించిన ఆదాయం, చేసిన ఖర్చులు, మిగులును లెక్కించే రోజును ఒక పవిత్ర కార్యక్రమంగా ఆణివార ఆస్థానం నిర్వహించారని ఆయన చెప్పారు.
పుష్పపల్లకీలో ఊరేగిన శ్రీవారు
ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారు అత్యంత శోభాయమానంగా అలంకరించిన దశావతారాల పుష్పపల్లకిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లు చతుర్మాడ వీధుల్లో ఊరేగుతున్న సమయంలో భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తిశ్రద్ధలతో స్వామిని ప్రార్థించారు. ఇవో అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు, ఆల య ప్రధానార్చకులు రమణ దీక్షితులు, డిప్యూటీ ఇవో కోదండరామారావు, ఓఎస్‌డి పాల శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురురాజారావు పాల్గొన్నారు.
చిత్రం.. శ్రీవారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న దృశ్యం