రాష్ట్రీయం

పోటెత్తిన వంశధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పోటెత్తిన నాగావళి శాంతించినా, వంశధారకు వరద ప్రవాహం పెరిగింది. మరో రెండు రోజులు క్యాచ్‌మెంట్ ఏరియాలో కుండపోత వర్షాలున్నాయని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో శ్రీకాకుళానికి వరదముప్పు పొంచివుంది. ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గత 24 గంటలుగా కురుస్తున్న వానలతో రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతల మవుతుంది. 42 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకోగా, పాలకొండ డివిజన్‌లో వేల హెక్టార్లలో వరి ముంపునకు గురైంది.