రాష్ట్రీయం

ఓటేసిన కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: అత్యున్నతమైన రాష్టప్రతి పదవికి తెలంగాణ నుంచి 117 ఓట్లు పోలయ్యాయి. సిఎం కెసిఆర్ తొలి ఓటు వినియోగించుకోగా, తర్వాత అసెంబ్లీ సభాపతి ఎస్ మధుసూదనాచారి, సిఎల్పీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె జానారెడ్డి ఓటు వేశారు. చివరి ఓటును బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్ రెడ్డి వేశారు. కాగా లండన్‌లోవున్న కారణంగా మజ్లిస్ శాసనసభాపక్షం నేత అక్బరుద్దీన్ ఓవైసీ, అనారోగ్యం కారణంగా తెరాస పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఓటింగ్‌కు వచ్చేందుకు మనోహర్ సిద్ధపడినా, వద్దని వైద్యులు వారించారు. ఈ విషయం తెలుసుకున్న సిఎం కెసిఆర్ కూడా ఓటింగ్‌కు రావొద్దని చెప్పినట్టు సమాచారం. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలు (నెం 1)లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ సాగింది. పోలింగ్‌కు ముందు తెరాస కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కెసిఆర్, పోలింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తర్వాత ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్, తెదేపా, బిజెపి ఎమ్మెల్యేలూ ఓటు వేశారు. మజ్లిస్ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరిగినా, చివరకు ఓట్లు వేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఓటు వేయడానికి వెళ్తున్న సమయంలో ఎదురైన మంత్రి లక్ష్మారెడ్డి ‘కోవింద్..కోవింద్’ అని ఆమెనుద్ధేశించి అనడంతో, అలా అనేందుకు నోరెలా వచ్చిందని అరుణ ప్రశ్నించినట్టు సమాచారం.
తగ్గిన చెరో ఓటు
రాష్ట్రం నుంచి 119 ఓట్లు ఉండగా, అక్బర్, మనోహర్ రెడ్డి గైర్హాజర్ కావడంతో రాష్టప్రతి రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు చెరో ఓటు తగ్గినట్టే. ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు తెరాస మద్దతు ప్రకటించినందున, మనోహర్ రెడ్డి వేయాల్సిన ఒక ఓటు తగ్గినట్టే చెప్పాలి. తెదేపా, బిజెపి ఓట్లు కోవింద్‌కు దక్కాయి. ఇక ఎన్డీయే అభ్యర్థిని వ్యతిరేకించిన మజ్లిస్ పార్టీ తొలుత ఓటింగ్‌కు దూరంగా ఉండాలనుకున్నా, చివరి నిమిషంలో ఓటింగ్‌లో పాల్గొంది. అక్బర్ గైర్హాజరు కారణంగా యుపిఏ అభ్యర్థి మీరాకుమార్‌కు ఒక్క ఓటు రాలేదని చెప్పొచ్చు.
పోలింగ్ ముగిసిన తర్వాత అసెంబ్లీ కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి డాక్టర్ ఎస్ రాజాసదారామ్, పరిశీలకునిగా వచ్చిన ఉన్నతాధికారి సుశీల్ కుమార్ అధ్వర్యంలో బ్యాలెట్ బాక్స్‌ను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం 6.30కు రిటర్నింగ్ అధికారి డాక్టర్ సదారామ్, అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ వి నరసింహాచారి విమానంలో బ్యాలెట్ బాక్స్‌ను ఢిల్లీకి తీసుకెళ్తారు.

చిత్రం.. హైదరాబాద్ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటు వేస్తున్న సిఎం కెసిఆర్