రాష్ట్రీయం

ఇబ్బంది పెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: సినీ పరిశ్రమలో సంచలనం రేపుతోన్న డ్రగ్స్ కేసులో అనుమానితులుగా ఉన్న టాలీవుడ్ ప్రముఖులంతా బుధవారం నుంచి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, సిట్ అధికారుల ద్వారా నోటీసులు అందుకున్న 12మందిని విచారి స్తారు. నోటీసులు అందుకున్న వారిలో నటి ముమైత్‌ఖాన్ వినా అందరూ విచారణకు హాజరవుతున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. ముమైత్‌ఖాన్ ఓ షోలో ఉన్నందున ఆమె విచారణ తేదీని నిర్ణయించలేదని సబర్వాల్ వివరించారు. అదేవిధంగా కొత్తవారికి ఇంకా నోటీసులు జారీ చేయలేదని చెప్పారు. డ్రగ్స్ విచారణ బుధవారం ఎక్సైజ్ కార్యాలయంలో జరుగుతుంది. సినీ ప్రముఖుల్లో తొలుత ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణను ఎదుర్కోనున్నారు. నటి ఛార్మీ, నటుడు సుబ్బరాజు, కెమెరామెన్ శ్యాం కె నాయుడు, రవితేజ, చిన్నా, నవదీప్, తరుణ్, తనీష్, నందులను రోజుకు ఒక్కొక్కరిని విచారించనున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు.
ఎవరినీ ఇబ్బంది పెట్టం: కమిషనర్
బుధవారం నుంచి మొదలు కానున్న డ్రగ్స్ కేసు విచారణకు సహకరించాలని, విచారణలో ఎవరినీ ఇబ్బంది పెట్టబోమని ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ తెలిపారు. డ్రగ్స్‌ను ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరి ద్వారా వస్తున్నాయి.. ఎప్పటి నుంచి సరఫరా జరుగుతుంది.. సినీ ఇండస్ట్రీలో క్రయ విక్రయాలు ఎప్పటి నుంచి, ఎవరు సాగిస్తున్నారు? వంటి అంశాలపై విచారణ జరుగుతుందని కమిషనర్ తెలిపారు. అదేవిధంగా డ్రగ్స్‌కు బానిసైనవారు ఎందరున్నారు.. ఎంతకాలం నుంచి వాడుతున్నారు.. వారి ఆరోగ్య పరిస్థితులపైనా ఆరా తీయనున్నట్టు కమిషనర్ చంద్రవదన్ వివరించారు.