రాష్ట్రీయం

ప్రశ్నించే గొంతులపై కేసులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, జూలై 18: ప్రశ్నించే గొంతులకు, బూటకపు ఎన్‌కౌంటర్లను ఎదిరిస్తే కేసులు నమోదు చేయడం ఏమిటని విరసంనేత వరవరరావు ప్రశ్నించారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిఫ్‌కోర్టుకు హాజరై అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ 1400మంది విద్యార్థుల ఆత్మబలిదానంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అన్నారు. 2007లో అమరుడు సందె రాజవౌళి బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ఓ దినపత్రికలో తాను వార్తరాస్తే తనపై పదేళ్ల తర్వాత కేసు నమోదు చేయడం సరైంది కాదన్నారు. అదే సంవత్సరంలో ఎన్‌కౌంటర్‌ను స్టీఫెన్ రవీంద్ర కేరళలోని కొల్లెం పట్టణంలో ఓటెలిఫోన్ బూతులో మాట్లాడుతున్న రాజవౌళిని అదుపులోకి తీసుకొని అనంతపూర్ జిల్లాలోని హిందూపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఎన్‌కౌంటర్ చేశారని, పక్కా ఆధారాల తో వార్తరాసిన తనపై కేసులు నమోదు చేసి కోర్టుకు పిలిచారని తెలిపారు. వలసవాదుల పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయని, చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాలం వరకు వలసవాదులు పాలకులుగా కొనసాగారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మావోయిస్టు ఎజెండాను పక్కకుపెట్టి, ప్రస్తుతం ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నాడని ఆరోపించారు. 1968-69లోనే ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేశామని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1997లో వరంగల్ 2లక్షల మందితో బహిరంగసభను ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమానికి పురుడుపోశామని తెలిపారు. టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని మాట్లాడిన కేసిఆర్ ప్రస్తుతం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంట కాంపెల్లి నారాయణ, బల్ల రవీంద్రనాథ్, ఆరెపల్లి జితెందర్, నర్సయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న విరసం నేత వరవరరావు