రాష్ట్రీయం

వైద్య కోర్సులకు 17,128 దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణలోని ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశానికి 17,128 దరఖాస్తులు వచ్చినట్టు కెఎన్‌ఆర్ హెల్త్ యూనివర్శిటీ విసి డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి చెప్పారు. సర్ట్ఫికేట్ల పరిశీలన ఈ నెల 22 నుండి 27వ తేదీ వరకూ కొనసాగిస్తామని ఇందుకోసం ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. నాల్ లోకల్ అభ్యర్ధులకు డాక్టర్ ఎన్‌టిఆర్ యుహెచ్‌ఎస్(విజయవాడ)లోనూ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీ, ఒయు దూర విద్యా కేంద్రంలోనూ, జెఎన్‌టియు కూకట్‌పల్లిలోనూ, ఎవి కాలేజీలోనూ ఈ వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. అభ్యర్ధుల మెరిట్ జాబితాలను, స్పెషల్ కేటగిరి జాబితాలను, ఇతర వివరాలను ఈ నెల 20వ తేదీన ప్రకటించనున్నట్టు ఆయన చెప్పారు.