రాష్ట్రీయం

అందరూ సహకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: డ్రగ్ మాఫియాపై ఉక్కుపాదం మోపేందుకు అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ కోరారు. ఈ వ్యవహారంలో విద్యా సంస్థలు, సినీ పరిశ్రమకు చెందిన వారు ఉండడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ వ్యవహారం ఆషామాషి కాదని, నోటీసులు అందుకున్న వారు విచారణకు సహకరించాలని ఆయన కోరారు. ఆధారాలు లభిస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటామని కమిషనర్ తేల్చి చెప్పారు. డ్రగ్స్ వ్యవహారంపై చాలా లోతుగా విచారణ జరుపుతున్నామని, అందరూ సహకరిస్తే వీలైనంత త్వరలోనే దర్యాప్తు పూర్తి చేస్తామని ఆయన వివరించారు. స్కూల్, కళాశాల, సాంకేతిక విద్యారంగాల కమిషనర్లు డ్రగ్స్ నివారణకు తగు చర్యలు తీసుకునే విధంగా సూచనలు చేశామని చంద్రవదన్ వివరించారు.