రాష్ట్రీయం

కాకతీయ టెక్స్‌టైల్ పార్క్‌కు తొలగిన అడ్డంకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: వరంగల్ జిల్లాలో 1200 ఎకరాల్లో నిర్మించనున్న మెగా టెక్స్‌టైల్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ అనుమతులు లభించడంతో నిర్మాణం పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయ మెగా టెక్స్‌టైల్ ప్రాజెక్టుకు అవసరమైన భూములను తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ సమకూర్చింది. వచ్చే 15 రోజుల్లో నిర్మాణం పనులు చేపట్టేందుకు రాష్ట్రప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి ప్రణాళికను ఖరారు చేశారు. మెగా పార్కులో దేశంలోని ప్రముఖ జౌళి సంస్థలు తమ అనుబంధ సంస్థలను నెలకొల్పేందుకు క్యూ కట్టాయి. రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందే 14పరిశ్రమల్లో జౌళి విభాగం ఒకటని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. సులభ రీతిలో వాణిజ్యం చేసే విధానాల్లో, టిఎస్‌ఐ పాస్‌లో తెలంగాణ రాష్ట్రం అగ్రాగమిగా ఉన్న విషయం ఇదితమే. ఫైబర్ టు ఫాబ్రిక్, జిన్నింగ్, స్పిన్నింగ్, నేత, ప్రోసెసింగ్, గార్మెంటింగ్ తదితర పరిశ్రమలు మెగా పార్కులో రానున్నాయి. తెలంగాణలో 60 లక్షల పత్తి బేళ్లు సాలీనా ఉత్పత్తి అవుతోంది. కాని 10లక్షల పత్తి బేళ్లు మాత్రమే ప్రొసెస్ అవుతున్నాయి. దీంతో పొరుగున ఉన్న రాష్ట్రాలకు పత్తి ప్రోసెసింగ్ నిమిత్తం పంపుతున్నారు. గుజరాత్ కంటే తెలంగాణలో పండే పత్తి నాణ్యత ఎక్కువ. మేలి రకం పత్తి ఇక్కడ లభిస్తుందని శాస్తవ్రేత్తలు ఇప్పటికే నిర్ధారించారు. ఇక్కడ టెక్స్‌టైల్ మెగాపార్కును ఏర్పాటు చేస్తే సూరత్, బివాండికి వలస వెళ్లిన తెలంగాణ నేత కుటుంబాలు తిరిగి వరంగల్‌కు చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ అధికారులు అంచనావేస్తున్నారు. మెగా పార్కులో రోడ్లు, మంచినీరు, విద్యుత్ తదితర సదుపాయాలు యుద్ధప్రాతిపదికన కల్పించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పరిశ్రమల శాఖను ఆదేశించారు.